Skip to content
క్రైమ్ వార్తలు

Tejaswini Case: హైదరాబాద్ టెకీ తేజస్విని మృతి కేసు.. అర్ధరాత్రి నగ్నంగా గుడిలో విగ్రహం తీసుకుని.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Prajapaksham 19 Jul 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Tejaswini Case: హైదరాబాద్ టెకీ తేజస్విని మృతి కేసు.. అర్ధరాత్రి నగ్నంగా గుడిలో విగ్రహం తీసుకుని.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Tejaswini Case: హైదరాబాద్ టెకీ తేజస్విని మృతి కేసు.. అర్ధరాత్రి నగ్నంగా గుడిలో విగ్రహం తీసుకుని.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Tejaswini Case: హైదరాబాద్ నగరంలో తీవ్ర కలకలం రేపిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని మృతి కేసు దర్యాప్తులో ఊహించని మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. చెరువులో దూకి ప్రాణాలు కోల్పోయిన టెకీ.. చనిపోయే ముందు ఒక గుడిలోని విగ్రహాన్ని తనతో పాటు తీసుకెళ్లినట్లు తేలడంతో పోలీసులు.. హైడ్రా బృందాలు ఇప్పుడు ఆ విగ్రహం కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పీర్జాదిగూడ శంకర్‌నగర్‌లో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా గణపతినగరం మండలం దేవలపల్లి గ్రామానికి చెందిన వకలగాడి తేజస్విని (27).. గతంలో బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా పనిచేసింది. గత మూడు నెలలుగా ఆమె తన తల్లి అరుణతో కలిసి శంకర్‌నగర్‌లో నివాసం ఉంటోంది. కొంతకాలంగా ఆమె తీవ్ర మానసిక ఆందోళనతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తేజస్విని తన దుస్తులన్నీ విప్పేసి.. నగ్నంగా ఇల్లు వదిలి బయటకు వచ్చింది. సమీపంలోని బీరప్ప ఆలయం లోపలికి ప్రవేశించి, అక్కడ ఉన్న విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని నేరుగా నడుచుకుంటూ వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. శనివారం ఉదయం సమాచారం అందుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే తేజస్విని వెంట తీసుకెళ్లిన విగ్రహం మాత్రం ఇంకా లభ్యం కాలేదు. ఈ కేసులో ఈ విగ్రహం కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో, హైడ్రా (HYDRAA) బృందం ప్రత్యేక పరికరాలు.. బోట్ల సహాయంతో చెరువులో ముమ్మరంగా అన్వేషణ సాగిస్తోంది.

ఈ దర్యాప్తులో తేజస్విని ఉంటున్న నివాసానికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు కూడా బయటపడ్డాయి. ఆమె ఉంటున్న అద్దె ఫ్లాట్‌కు రోజుకు రూ. 3,500 చొప్పున నెలకు దాదాపు రూ. లక్ష వరకు అద్దె చెల్లిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఆమె నివసిస్తున్న భవనంలోని పై రెండు అంతస్తులను అక్రమంగా ఒక లాడ్జిలా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ అక్రమ లాడ్జి నిర్వహణకు.. తేజస్విని మృతికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనను మానసిక ఆందోళన కారణంగా జరిగిన ఆత్మహత్యగా భావిస్తున్నప్పటికీ.. ఆమె రాసినట్లుగా చెబుతున్న డెత్ డిక్లరేషన్, ఇటీవల ఆమె జరిపిన ఆర్థిక లావాదేవీలు, పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు.