Skip to content
క్రైమ్ వార్తలు

నేషనల్ పోలీస్ అకాడమీలో ఘోరం: ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై తోటి అధికారి లైంగిక వేధింపులు..కేసు నమోదు..

Prajapaksham 19 Jul 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
నేషనల్ పోలీస్ అకాడమీలో ఘోరం: ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై తోటి అధికారి లైంగిక వేధింపులు..కేసు నమోదు..

నేషనల్ పోలీస్ అకాడమీలో ఘోరం: ట్రైనీ ఐపీఎస్ అధికారిణిపై తోటి అధికారి లైంగిక వేధింపులు..కేసు నమోదు..

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీ (ఎన్‌పీఏ)లో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తోటి ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్యకర సందేశాలు పంపి తననను సదరు ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణా రెడ్డి లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు ఆరోపించారు. అయితే ఈ ఫిర్యాదు ఆధారంగా అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యంగా బాధిత మహిళ ఆరోపణల్లో ప్రధానంగా నిందితుడు అనుమతి లేకుండా బాధితురాలి వీడియోలు తీశాడని ఆమె ఆరోపించారు. వీడియోలతో పాటు బెదిరింపులకు సైతం పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై బీఎన్‌ఎస్ సెక్షన్లు 74, 75, 77, 315(2), 66(E) కింద కేసు నమోదు చేశారు.ఇదిలా ఉంటే ఇప్పటికే నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించినట్లు సమాచారం అందుతోంది.

బిగ్ టీవీ వెబ్ పోర్టల్ కథనం ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించిన మరికొన్ని షాకింగ్ వివరాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలైన ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి కొంతకాలంగా ఆమెకు అసభ్యకరమైన సందేశాలు పంపుతూ మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు తెలిసింది. అంతేకాకుండా, ఈనెల 9వ తేదీన ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెపై భౌతిక దాడికి దిగి, బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి పదునైన ఆయుధంతో బెదిరింపులకు పాల్పడినట్లు సదరు వార్తా కథనంలో పేర్కొన్నారు. అంతటితో ఆగకుండా బాధితురాలికి సంబంధించిన కొన్ని వ్యక్తిగత దృశ్యాలను (వీడియోలను) నిందితుడు రికార్డ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ తర్వాత ఆమె మొబైల్ ఫోన్‌ను లాక్కొని, ఆ వ్యక్తిగత వీడియోలను బాధితురాలి భర్త వాట్సాప్ నెంబర్‌కు సైతం పంపించినట్లు సమాచారం. ఈ ఘోర ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు.

ట్యాగ్‌లు: Crime crime against women