వెంకటేష్- అనిల్ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి
First schedule of Venkatesh-Anil film completed.
విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది. ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై సాహు గారపాటి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్లో నిర్మించారు. వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్, కీర్తి సురేష్ కృతి శెట్టి షూటింగ్ లో పాల్గొన్నారు.ఈ షెడ్యూల్లో కీలకమైన టాకీ పార్ట్‌తో పాటు ఓ అద్భుతమైన పాటను చిత్రీకరించారు.
చాలా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి.ఇప్పటికే విడుదల చేసిన కళ్యాణ్ రామ్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే అనిల్ రావిపూడి తనదైన క్రియేటివ్ ప్రమోషన్స్ ఇప్పటికే అంచనాలు పెంచారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఎ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఎస్. కృష్ణ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఈ చిత్రం 2027 సంక్రాంతికి రిలీజ్ కానుంది.ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: సమీర్ రెడ్డి,ఎడిటర్: తమ్మిరాజు.