Skip to content
వినోదం › వార్తలు

ఇంట్రెస్టింగ్‌గా ‘ది మేజ్‌” ట్రైలర్‌ : హీరో శ్రీరామ్‌

Prajapaksham 17 Nov 2026 1 నిమిషాల పఠనం వినోదం
ఇంట్రెస్టింగ్‌గా ‘ది మేజ్‌” ట్రైలర్‌ : హీరో శ్రీరామ్‌

Sri ram

తమిళ, తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో శ్రీరామ్‌ (శ్రీకాంత్‌) నటిస్తున్న కొత్త సినిమా ‘ది మేజ్‌’. ఈ మూవీలో ప్రియాంక, హ్రితిక శ్రీనివాస్‌, కమల్‌ కామరాజు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని డాక్టర్‌ నైమిష రెడ్డి కసిరెడ్డి సమర్పణలో శ్రౌష కమల ఆర్ట్‌, యుఆర్‌ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై డాక్టర్‌ ఉదయ్‌ కె. రెడ్డి పాల్వాయి, డాక్టర్‌ కెఎస్‌ఆర్‌ (కరెడ్డి శ్రీధర్‌ రెడ్డి), డాక్టర్‌ భరత్‌ రెడ్డి గోపు, డాక్టర్‌ అనిరుధ్‌ రెడ్డి సోమ నిర్మిస్తున్నారు. ‘ది మేజ్‌’ చిత్రాన్ని సరికొత్త సైకలాజికల్‌ థ్రిల్లర్‌ కథతో దర్శకుడు డాక్టర్‌ రవికిరణ్‌ గడలాయ్‌ రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా పాన్‌ ఇండియా థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది. డైరెక్టర్‌, ప్రొడ్యూసర్‌ మధుర శ్రీధర్‌ రెడ్డి, డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ అతిథులుగా ‘ది మేజ్‌’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో దర్శక నిర్మాత మధుర శ్రీధర్‌ రెడ్డి మాట్లాడారు. హీరో శ్రీరామ్‌ (శ్రీకాంత్‌) మాట్లాడుతూ ఈ సినిమాలో ప్రతి సీన్‌లో నన్ను కొత్తగా చూపించాలని డైరెక్టర్‌ రవికిరణ్‌ తపించారు. డిఒపి శివకృష్ణ, నటి శ్రీష , నిర్మాత డాక్టర్‌ ఉదయ్‌ కె. రెడ్డి పాల్వాయి నటుడు రవివర్మ, నటుడు కమల్‌ కామరాజు, హీరోయిన్‌ హ్రితిక శ్రీనివాస్‌, హీరోయిన్‌ ప్రియాంక, డైరెక్టర్‌ డా. రవికిరణ్‌ గడలాయ్‌ , డైరెక్టర్‌ రాహుల్‌ రవీంద్రన్‌ మాట్లాడారు.