న్యూ ఏజ్ లవ్ స్టొరీ ‘హే కన్నమ్మ’
Hey kannamma
యశ్వంత్, ధనశ్రీ వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న న్యూ ఏజ్ లవ్ స్టొరీ ‘హే కన్నమ్మ’. శశి కుమార్ ముత్తులూరి రచన, దర్శకత్వంలో, జీ స్టూడియోస్ సమర్ప ణలో, దిల్ రాజు ప్రొడక్షన్స్ ఎల్ఎల్పి బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ”నా జీవితం నా కలలు నా ఆశలు నా ఇష్టాలు.. నాది నేను అని బ్రతికిన నాకు ఇప్పుడు నీ కళ్ళతో ప్రపంచాన్ని చూస్తుంటే.. నువ్వు కోరుకున్న ప్రేమ ఎలా ఉంటుందో నాకు అర్థం అవుతుంది కన్నమ్మ’ అనే వాయిస్ ఓవర్ తో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. యశ్వంత్, ధనశ్రీ వర్మ పాత్రలని ప్రజెంట్ చేసిన తీరు సినిమాపై ఆసక్తిని పెంచింది. జయ్ కృష్ణ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రాంపీ నందిగం సినిమాటోగ్రఫీ, గాంధీ నడికూడికర్ ప్రొడక్షన్ డిజైన్ సినిమాకు మంచి విజువల్ ఫీల్ తీసుకొచ్చాయి.దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు టాప్ క్యాలిటీలో ఉన్నాయి. యశ్వంత్, కార్తిక మురళీధరన్, ధనశ్రీ వర్మ, వెంకటేష్ కాకుమాను, బ్రహ్మాజీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: జయ్ కృష్ణ. సినిమాటోగ్రఫీ: రాంపీ నందిగం,ఎడిటర్: మధు, ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికూడికర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: బండి రత్న కుమార్
లైన్ ప్రొడ్యూసర్:
ఆకుల్.