హై’ జెన్ జీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉంది..ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి
High
దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి పలు విజయవంతమైన సినిమాలకు కో-రైటర్‌గా పనిచేసిన ఎస్ కృష్ణ, ‘హై’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన ఒక ప్రధాన పాత్రలో కూడా నటిస్తున్నారు. ఇమేజ్‌స్పార్క్ ఎంటర్‌టైన్‌మెంట్, మైరా క్రియేషన్స్ బ్యానర్లపై హరీష్ పెద్ది, ఎస్ కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నవంబర్ 27న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో వివిధ వ్యక్తులు తమకు నచ్చిన ఆనందం, సంతోషం, థ్రిల్ కోసం చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో వారు ఎదుర్కొనే సమస్యలను ఆకట్టుకునేలా చూపించారు. లిప్‌స్టిక్ లావణ్య పాత్రలో అనన్య శర్మ తన ఎనర్జీ, నటనతో ఆకట్టుకున్నారు. మద్యానికి బానిసైన వ్యక్తి పాత్రలో ఎస్ కృష్ణ ఇంటెన్సిటీ చూపించారు. పల్లవి దొర, కృష్ణ కమల్, సాయి కృష్ణ, రేవంత్ (బుల్లిరాజు) తమ పాత్రల్లో చక్కగా నటించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హాజరయ్యారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ ఈ సినిమా నేను చూశాను. సాయి చాలా కొత్తగా ప్రయత్నించాడు. న్యూ ఏజ్ ఫిల్మ్ మేకింగ్‌తో జెన్జీ ఆడియన్స్‌కు కనెక్ట్ చేయాలని చాలా బాగా కష్టపడ్డాడు. తను ఇన్ఫ్లూయన్సర్స్ కోసం రిలీజ్‌కు ముందే ఒక షో వేయబోతున్నాడు. తప్పకుండా అది తనకు మంచి రిజల్ట్ ఇస్తుంది. తనకు సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయి నా స్నేహితుడు. నేను చేస్తున్న సినిమాలకు రచయితగా నన్ను చాలా భరిస్తాడు. నా విషయంలో తనకు ఓపిక ఎక్కువ. తను డైరెక్టర్‌గా, యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవడానికి ఒక మంచి ప్రాజెక్ట్‌తో మీ ముందుకు వచ్చాడు. తను ఎంత కష్టపడ్డాడో నేను చూస్తూ వచ్చాను. ఈ ప్రయాణంలోచాలా నేర్చుకున్నాడు. తనకు ఈ సినిమా చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చింది. అలాగే మంచి ఫలితం కూడా రావాలని కోరుకుంటున్నాను. సాయి వాళ్ల నాన్నగారికి తను యాక్టర్ కావాలనే కోరిక ఉండేది. చాలాసార్లు తనకు మంచి వేషం ఇవ్వమని నన్ను అడిగారు. కానీ సాయి అప్పుడు సీరియస్‌గా తీసుకోలేదు. నెక్స్ట్ సినిమాలో తనకు మంచి వేషం ఇస్తాను. ఈ సినిమాలో తనలో ఉన్న నటనను చూపించాడు. ఈ సినిమాలో నటీనటుల పెర్ఫార్మెన్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా నచ్చింది. వికాస్ చాలా మంచి సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అలాగే డీఓపీతో పాటు మిగతా టెక్నీషియన్స్ అందరూ కూడా ప్రాణం పెట్టి పనిచేశారు. ఇందులో శ్రీనివాస్ గారు చాలా మంచి వేషం చేశారు. తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. నవంబర్ 27న రిలీజ్ కాబోతోంది. ఇది చిన్న సినిమా కావచ్చు. కాకపోతే చాలా పెద్ద స్కేల్‌లో తీశారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, హీరో ఎస్ కృష్ణ, శ్రీనివాస్ వడ్లమాణి, సాయి కృష్ణ, అదిరే అభి , అనన్య శర్మ రేవంత్ పాల్గొన్నారు.