25న ‘వృషకర్మ’ ట్రైలర్ రిలీజ్
Vrushakarma
నాగ చైతన్య తాజాగా నటించిన మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’. కార్తీక్ దండు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బాపినీడు, బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మైథాలజీ, మిస్టరీ, సస్పెన్స్ కలయికతో ఒక భారీ సినిమాటిక్ స్పెక్టకల్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పురాతన రహస్యాలు, మిస్టీరియస్ అంశాలతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్లబోతోంది.
తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను నవంబర్ 25న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నెల్లూరులోని ‘ఎస్ వి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్’లో జరిగే గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విడుదల చేయనున్నారు. ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ పోస్టర్లో నాగ చైతన్య ఇంటెన్స్, డిటర్మైండ్ ఎక్స్ప్రెషన్తో కనిపిస్తున్నారు. భుజంపై తాడు వేసుకుని, ఒక చేతిని ముందుకు చాపిన స్టైలిష్ లుక్ ఆకట్టుకుంటోంది. కళ్లద్దాలు, ఒత్తైన గడ్డంతో జయరామ్ కనిపిస్తుండగా, మరోవైపు కళ్లద్దాలు ధరించిన మీనాక్షి చౌదరి చేతిలో నిప్పుతో ఉన్న వస్తువును పట్టుకుని కనిపిస్తున్నారు. ఈ విజువల్ పోస్టర్‌కు మరింత మిస్టికల్ టచ్ ఇచ్చింది.ఈ సినిమాలో స్పర్శ్ శ్రీవాస్తవ విలన్ పాత్రలో నటిస్తున్నారు. రఘుల్ డి హెరియన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, బి. అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగ చైతన్య, మీనాక్షి చౌదరి, స్పర్శ్ శ్రీవాస్తవ, జయరామ్, కియారా ఖన్నా, సత్య నటిస్తున్నారు.