Skip to content
జాతీయం వార్తలు

అమరత్వానికి రమణీయతను అద్దిన విప్లవ గొంతుక పరిటాల నాగన్న

Prajapaksham 27 Jul 2026 0 నిమిషాల పఠనం జాతీయం
అమరత్వానికి రమణీయతను అద్దిన విప్లవ గొంతుక పరిటాల నాగన్న

అమరత్వానికి రమణీయతను అద్దిన విప్లవ గొంతుక పరిటాల నాగన్న

ఏనుగు వెంకటేశ్వరరావు, ఖమ్మం

అమరత్వానికి రమణీయత తెచ్చి విప్లవ గొంతుక ప్రజల పక్షాన పోరాడి ఎందరో త్యాగధను లు తమ ప్రాణాలను కోల్పోయారు. కానీ ప్రాణాలు కోల్పోయిన వీరుల స్మరించడం ద్వారా అమరత్వానికి రమణీయతను అద్దిన విప్లవ గొంతుక పరిటాల నాగన్న అలియా స్‌ అరుణోదయ నాగన్న. కళ వ్యా పార రంగమై ప్రజా కళలు సైతం వ్యాపార గుప్పె చిక్కుకుని విలవిలలాడుతున్న సమయమిది. వర్గ చైతన్యాన్ని, సామాజిక ధృక్పథాన్ని మరిచి తమ గొంతుకలను అమ్ముకుంటున్న సందర్భం. లేని దానిని సృష్టించి ఉన్నట్లుగా ప్రజలను భ్రమించే రీతి లో పాటలు పాడుతూ రాజకీయ నాయకుల ప్రాపకం పొందుతున్నారు. కానీ తన గళాన్ని, కలాన్ని, ప్రజా చైతన్యానికి, వర్గ పోరాటాలకు మాత్ర మే అంకితం చేసిన కవి, గాయకుడు అరుణోదయ నాగన్న. తనకు సినిమాల్లో అవకాశం వచ్చినప్పుడు ఆ పారితోషికాన్ని సైతం పార్టీ నిధికి జమ చేసిన నాగన్న ప్రజా సాంస్కృతికోద్యమంలో విరామమెరుగని కళాకారు డు. 40 ఏళ్ల పాటు నిబద్దతగా తన కంఠాన్ని జన చైతన్యం కోసం ఉపయోగించాడు. ఎమర్జెన్సీ సమయంలో పోట్ల రామనర్సయ్యను అప్పటి పోలీసు లు ఎన్‌కౌంటర్‌ పేరుతో కాల్చి చంపినప్పుడు పోట్ల రామనర్సయ్య త్యాగ చరిత అంతగా తెలిసింది కాదు. కానీ అన్న అమరుడురా మన రామనర్సయ్య అన్న పాటను గ్రామ గ్రామాన పాడి రామనర్సయ్య అమరత్వాన్ని రమణీయంగా మార్చిన కళాకారుడు నాగన్న, ఒక్క పోట్ల రామనర్సయ్యే కాదు అప్పటి దళ నేత ఎల్లన్న అలియాస్‌ చండ్ర కృష్ణమూర్తి మరణించినప్పుడు ఆయన పాడిన స్మృతి గీతాలు సైతం ఎల్లన్న కీర్తిని అజరామరం చేశాయి. వీరా సూరా విప్లవ రణధీర ఎల్లన్న అన్న పాట బహుళ ప్రజాధరణ పొందింది. నాగన్న గొంతు నుంచి ఆ పాట వింటుంటే రోమాలు నిక్కరపోడుచుకునేవి. ఇటీవల కాలంలో పోలీస్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన లింగన్నను స్మరిస్తూ నాగన్న పాడిన పాట లింగన్న అమరత్వాన్ని అజరామరం చేసింది. చికాగో నగరానా చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ అది ఎట్ల చేరిందో రోళ్లగడ్డ అన్న యోచన పాటను తన గొంతుక ద్వారా వినిపించి నాగన్న లింగన్నకు ఒక చరిత్ర లిఖించాడు. సాదా సీదాగా జనం మధ్యనే ఉంటూ జనం పాటలు పాడిన నాగన్న గొంతుక వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ ఆయన ఆర్థికంగా తీవ్ర దుర్బర స్థితి ఎదుర్కొన్నారు. ఖమ్మం నగరంలోని మమత ఆసుపత్రి ఏరియాలో నా గార్జున సాగర్‌ కాలువ కట్టపై చిన్న ఇంట్లో జీవించే వారు. ప్రభుత్వం గుడిసెల తొలగింపులో ఆ గుడిసెను కూల్చివేస్తే నాగన్న కుటుంబం రోడ్డున ప డింది. అయినా తన కుటుంబ జీవనోపాధి కోసం ఎవరి ముందు చేయి చాచని నాగన్న తన గొంతును అమ్ముకోవడానికి ప్రయత్నించ లేదు. సీదా సాదా కళాకారులు సైతం ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని యూట్యూబ్‌ల ద్వారా వేల రూపాయలు సంపాదిస్తున్న నేటి తరుణంలో బుర్రకథ, యక్షగానం, జముకుల కథ, హరికథ, గొల్లసుద్దులు, పిట్టలదొర ఇత్యాది కళారూపాలను ప్రదర్శిస్తూ అత్యంత ప్రజాదరణ పొం దిన నాగన్న తన కళను ప్రజా చైతన్యానికి తప్ప ఆర్థిక అవసరాలకు వినియోగించ లేదు. ఐదు దశాబ్దాల పాటు తన పాటతో ఎందరినో చైతన్యపరిచిన నాగన్న పల్లెటూరి కూలీ రైతానీ పిల్ల జెల్ల సల్లగున్నారా అంటూ రైతులను పలకరించినా ఈ ఊరు మనదిరా ఈ వాడ మనదిరా అంటూ దొర తనాన్ని ప్రశ్నించిన నాగన్నకే చెల్లింది. నాగన్నను సంస్మరించుకుంటున్న సందర్భంగా కలాలు, గళాలు డబ్బుకు దాసోహమంటున్న ఈ వేళ నాగన్న తన కుటుంబాన్ని కళకే అంకితం చేశాడు. నాగన్న భార్య లక్ష్మి సైతం బుర్రకథలో వంతగా నిలవడంతో పాటు పలు పాటలు పాడేది. కు మారుడు అజయ్‌ సైతం తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అభ్యుద య గీతాల ఆలాపనలో ఉన్నాడు. నాగన్న జీవితం నుంచి రెండు విషయా లు నేర్చుకోవాలి. ఆర్థిక సమస్యలు చుట్టు ముట్టినా తన గొంతును అరువు ఇవ్వడం ద్వారా ఆర్థిక సమస్యలను అధిగమించే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా గొంతును ప్రజా ఉద్యమానికి అంకితం చేయడం రెండవది తన తర్వాతి తరాన్ని కూడా ప్రజా ఉద్యమాల వైపు మర్చడం నిజంగా అభినందనీయం. వీరులు మరణిస్తే కొన్ని రోజుల పాటు చెప్పుకుని ఆ తర్వా క్రమేపి మరిచిపోవటం అలవాటే. కానీ ఆ వీరునికి సంబంధించిన పాట తో ఆ అమరత్వానికి రమణీయతను అద్ది జగద్వీదితం చేయడంతో పాటు అజరామరం చేసిన నాగన్న నిజంగా అమరుడు, స్మరణీయుడు.

ట్యాగ్‌లు: Paritala Naganna revolutionary voice