Skip to content
వినోదం వార్తలు

‘రణబాలి’ టీజర్‌ విడుదల

Prajapaksham 11 Sep 2026 1 నిమిషాల పఠనం వినోదం
‘రణబాలి’ టీజర్‌ విడుదల

Ranabali

విజయ్‌ దేవరకొండ రష్మిక కలిసి నటించిన ‘రణబాలి‘ సినిమా టీజర్‌ వచ్చేసింది. ఈ టీజర్‌ విజయ్‌ దేవరకొండ నట విశ్వరూపాన్ని చూపిస్తూ గూస్‌ బంప్స్‌ తెప్పిస్తోంది. రాక్షస రాజుగా పేరున్న సర్‌ థియోడర్‌ హెక్టార్‌ ఆజ్ఞపై పండిన ప్రతి ధాన్యపుగింజను దోపిడీ చేస్తూ అన్నపూర్ణగా వెలిగిన మన నేలను కరువు సీమగా మార్చేస్తుంటారు బ్రిటీష్‌ అధికారులు. ఆకలి అని అడిగిన వారిని క్రూరంగా చంపేస్తుంటారు. ఈ రాక్షస రాజు సర్‌ థియోడర్‌ హెక్టర్‌ కు, అతని అధికారులను తన ధైర్య సాహసాలతో అంతే క్రూరంగా ఎదుర్కొంటాడు రణబాలి. గుండె ధైర్యం నిండిన అతని దాటికి, పదునెక్కిన అతని కత్తి వేటుకి బ్రిటీష్‌ అధికారులు, పోలీసులు చెల్లాచెదురు అవుతారు. ఒక్క ధాన్యపు గింజ పొలిమేర దాటకుండా కాపలా కాస్తూ తన ప్రజల ఆకలి తీర్చుతాడు రణబాలి. అతని పేరేంటని ఆరా తీసిన బ్రిటీష్‌ అధికారులకు ’శింగనమల బొబ్బిలి రణబాలిరా..నీ యక్కా’ అంటూ పౌరుషంగా సమాధానం ఇస్తాడు. ఆ కొండపైనున్న మా భద్రమల్లాడి మీద ఆన..నేను కాయలి కాసాండంగా, ఒక్క మెతుకు గూడ పొలిమేర దాడదు చెప్తన్నా..అంటూ రణబాలి పాత్రలో విజయ్‌ చెప్పిన డైలాగ్‌ గూస్‌ బంప్స్‌ తెప్పిస్తోంది. రణబాలి ఒక గుహ ముందు మట్టి కుండలో పెట్టిన ద్రావణాన్ని ఒక చేయి వచ్చి అందుకుంటున్నట్లు టీజర్‌ చివరి షాట్‌ లో చూపించడం క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తోంది. రణబాలి’ చిత్రంతో దర్శకుడు రాహుల్‌ సంకృత్యన్‌ ప్రేక్షకులకు మరపురాని సినిమాటిక్‌ ఎక్సిపీరియన్స్‌ ఇవ్వబోతున్నట్లు ఈ టీజర్‌ తో తెలుస్తోంది. టి సిరీస్‌, మైత్రీ మూవీ మేకర్స్‌ వరల్‌ క్లాస్‌ ప్రొడక్షన్‌ క్వాలిటీస్‌ టీజర్‌ లో ఆకట్టుకుంటున్నాయి. టీ సిరీస్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై ‘రణబాలి‘ సినిమాను ప్రొడ్యూసర్స్‌ నవీన్‌ యెర్నేని, వై రవిశంకర్‌ హ్యూజ్‌ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్‌ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా ‘రణబాలి‘ సినిమా రూపొందుతోంది. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్‌ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్‌ వైడ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రాబోతోంది

వైవిధ్యమైన కథతో ‘ఐ బొమ్మ’
బానోత్‌ పవన్‌, గౌతమ్‌, నర్మద, సతీష్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘ఐ బొమ్మ‘. ఈ చిత్రాన్ని శ్రీ మల్లన్న క్రియేషన్స్‌ బ్యానర్‌ పై కురువ జమన్న నిర్మిస్తున్నారు. విజయ్‌ రఘునాథభట్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా త్వరలో వరల్‌ వైడ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు రెడీ అవుతోంది. హైదరాబాద్‌లో ‘ఐ బొమ్మ‘ సినిమా ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ – ‘ఐ బొమ్మ‘ సినిమా ట్రైలర్‌ బాగుంది. చిన్న చిత్రాల నిర్మాతలకు క్యూబ్‌ యూఎఫ్‌ వో ఛార్జీలు భారంగా మారుతున్నాయి. నిర్మాతల మండలికి కొత్తగా ఎన్నికైన మా కార్యవర్గం తరుపున ఈ సమస్యకు పరిష్కారం చేయాలని అనుకుంటున్నాం అన్నారు.అతిథిగా వచ్చిన ప్రొడ్యూసర్‌ రాజా మాట్లాడుతూ – నేను వర్జిన్‌ బాయ్స్‌ సినిమా నిర్మించిన తర్వాత డైరెక్టర్‌ విజయ్‌ నా దగ్గరకు వచ్చి కలిశాడు. రెండు మూడు స్క్రిపట్స్‌ కూడా చెప్పాడు. మంచి టాలెంట్‌ ఉన్న యువ దర్శకుడు విజయ్‌ అన్నారు. మూవీ ప్రొడ్యూసర్‌ కురువ జమన్న మాట్లాడుతూ మా వృత్తి వ్యవసాయం. సినిమాల మీద ఇష్టంతో చిత్ర నిర్మాణంలోకి వచ్చాను. దర్శకుడు విజయ్‌ చెప్పిన కథ బాగా నచ్చింది. . ఓవర్‌ ది నైట్‌ స్క్రిప్ట్‌ కంప్లీట్‌ చేసి 15 రోజుల్లో షూటింగ్‌ కంప్లీట్‌ చేశాం. అన్నారు. నటుడు బానోతు పవన్‌ , డివోపీ – ఆనంద్‌ మరుకుర్తి, మ్యూజిక్‌ – హనుమ ప్రసాద్‌ యాళ్ల ప్రొడ్యూసర్‌ – కురువ జమన్న స్క్రిప్ట్‌, డైరెక్షన్‌ – విజయ్‌ రఘునాథభట్ల.