Skip to content
ప్రపంచం › వార్తలు

Emergency Preparedness: అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండండి.. మూడు రోజులకు సరిపడా సరుకులు నిల్వ ఉంచుకోవాలని ప్రజలకు యూకే, జపాన్ కీలక సూచన..

jagan 27 Oct 2026 1 నిమిషాల పఠనం ప్రపంచం
Emergency Preparedness: అత్యవసర పరిస్థితులకు సిద్ధంగా ఉండండి.. మూడు రోజులకు సరిపడా సరుకులు నిల్వ ఉంచుకోవాలని ప్రజలకు యూకే, జపాన్ కీలక సూచన..

UK and Japan

తుఫాన్లు, వరదల వంటి విపత్తులకు సిద్ధంగా ఉండాలని పిలుపు

వాతావరణ అత్యవసర పరిస్థితులపై అప్రమత్తం అవుతున్న పలు దేశాలు

Emergency Preparedness: మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఊహించని ప్రకృతి విపత్తులను తట్టుకునేందుకు యూకే (యునైటెడ్ కింగ్‌డమ్) , జపాన్ ప్రభుత్వాలు తమ దేశ పౌరులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి. ప్రతి ఇంట్లోనూ కనీసం మూడు రోజులకు సరిపడా ఆహార పదార్థాలు, తాగునీరు , అత్యవసర ఔషధాలను నిల్వ ఉంచుకోవాలని ఆయా దేశాల నివారణా యంత్రాంగాలు పౌరులకు అధికారికంగా సూచించాయి.

అయితే ఈ ఆదేశాల పట్ల పౌరులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ఇది తక్షణమే సంభవించే ఎటువంటి యుద్ధం లేదా నిర్దిష్ట భద్రతా ముప్పు వల్ల జారీ చేసిన హెచ్చరిక కాదని అధికారులు స్పష్టం చేశారు.

కేవలం తీవ్రమైన శీతాకాల తుపానులు, ప్రచండ ఈదురుగాలులు, , ఆకస్మిక వరదలు వంటి తీవ్రమైన వాతావరణ పరిణామాల (Extreme Weather Conditions) సమయంలో సరఫరా వ్యవస్థలకు అంతరాయం కలిగితే పౌరులు ఇబ్బంది పడకుండా ఉండేందుకే ఈ ముందస్తు సన్నాహక ఆదేశాలు ఇచ్చామని వివరించారు.