Skip to content
వినోదం వార్తలు

15 ఏళ్ల నా కల ‘పంచనామా’.. ఉదయభాను

Prajapaksham 11 Sep 2026 0 నిమిషాల పఠనం వినోదం
15 ఏళ్ల నా కల ‘పంచనామా’.. ఉదయభాను

Udayanabu

జీ5 మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌ను అందుబాటులోకి తీసుకురాబోతుంది. అదే ‘పంచనామా’ సిరీస్‌. ప్రముఖ నటుడు భరత్‌ శ్రీనివాసన్‌ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ సెప్టెంబర్‌ 11 నుంచి జీ5లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. మోహన్‌ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో 6 ఎపిసోడ్స్‌ ఉండనున్నాయి. హైదరాబాద్‌లో ప్రివ్యూ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత, షో రన్నర్‌ ఉదయభాను మాట్లాడుతూ నేను ఎమోషనల్‌ అవ్వకూడదని అనుకున్నాను. నిర్మాతగా మారాలనేది నా సాధారణ కల కాదు. దాదాపు 15 ఏళ్లుగా ఒక తపస్సు చేస్తున్నాను. టెలివిజన్లోనే పుట్టాను, ఉదయభాను కాస్తా హృదయభానుగా మారింది అక్కడే.. అందుకే టెలివిజన్‌ నుంచే నా ప్రొడక్షన్‌ మొదలుపెట్టాలని ఇన్నేళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేశానో, ఎంత మంచి కంటెంట్‌ మోసుకుంటూ ఎక్కడికెక్కడికో వెళ్లానో నాకే తెలుసు. వచ్చే వారం, వచ్చే నెల మొదలవుతుంది అనుకుంటూనే ఆగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. చివరికి నా చిన్ననాటి స్నేహితుడు శ్రీరామ్‌ ద్వారా ‘జీ’ హెడ్‌ అనురాధ మేడమ్‌ను కలిశాను.ఆ తర్వాత వారి ఆలోచనలకు తగినట్లుగా ఈ ప్రాజెక్ట్‌ ఓకే అయింది. నా బిడ్డల కోసం నేను ఎలాగైతే తాపత్రయపడతానో.. ఈ ప్రాజెక్ట్‌ కోసం కూడా అంతే తాపత్రయపడ్డాను. ఇంత తక్కువ సమయంలో, ఇంత మంచి క్వాలిటీతో సిరీస్‌ పూర్తి చేయడానికి మా టీమ్లోని ప్రతి ఒక్కరూ 100 శాతానికి మించి శ్రమించారు. దర్శకుడు, రైటర్‌ నాగేంద్ర గారు, నేను కలిసి భరత్‌ గారికి కథ చెప్పగానే ఆయనకు నచ్చేసింది. లక్కీగా ఆయన డేట్లు దొరికాయి. 15 ఏళ్లుగా నా కడుపులో దాచుకున్న ఆవేదన, ఎమోషన్‌ ఇది.. అందుకే కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాను. ఈ ‘పంచనామా’ సిరీస్‌ సెప్టెంబర్‌ 11న జీ5 లో విడుదలవుతోంది, ఇది కచ్చితంగా సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అవుతుందని నమ్ముతున్నాను.‘ అని అన్నారు. హీరో ప్రేమిస్తే భరత్‌ , నిర్మాత విజయేంద్ర మౌళి , డైరెక్టర్‌ మోహన్‌ శ్రీాత్సవ , నటుడు సూర్య శ్రీనివాస్‌, నటి శ్రీజ , నటుడు శివ కార్తీక్‌ దండ ,రైటర్‌ నాగేంద్ర పిల్లా చీఫ్‌ కో డైరెక్టర్‌ బాలకృష్ణ కట్టా, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ భావన పోలేపల్లి పాల్గొన్నారు.