అక్కినేని నాగార్జున 100వ చిత్రం KING100 గ్లింప్స్ విడుదల: దే కాల్ మి ది కింగ్ అంటూ నాగ్ మాస్ ఎంట్రీ
అక్కినేని నాగార్జున 100వ చిత్రం #KING100 గ్లింప్స్ విడుదల: దే కాల్ మి ది కింగ్ అంటూ నాగ్ మాస్ ఎంట్రీ
KING100: గ్లింప్స్‌లో నాగ్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. “డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు.. డబ్బు ఉన్నప్పుడు దే కాల్ మి ది కింగ్” అలాగే “దిస్ ఐడెంటిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దేన్ మనీ” అంటూ నాగార్జున చెప్పే సంభాషణలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
KING100: టాలీవుడ్ ‘కింగ్’ అక్కినేని నాగార్జున తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మైలురాయిని చేరుకున్నారు. ఆయన కెరీర్లో 100వ చిత్రంగా తెరకెక్కుతున్న వర్కింగ్ టైటిల్ #KING100కి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. నాగార్జున ల్యాండ్‌మార్క్ ప్రాజెక్ట్ కావడంతో ప్రకటన వచ్చిన నాటి నుంచే భారీ అంచనాలు నెలకొనగా, ఇప్పుడు విడుదలైన గ్లింప్స్ అభిమానుల అంచనాలను పతాక స్థాయికి చేర్చింది.
ఈ గ్లింప్స్‌లో నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తనదైన ‘వింటేజ్ చార్మ్’తో పాటు క్లాస్, మాస్ అవతార్‌ను కలబోసిన లుక్‌లో ఆయన అదరగొట్టారు. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఆయన చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ అభిమానులకు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. “డబ్బు లేనప్పుడు నన్ను లూజర్ అన్నారు.. డబ్బు ఉన్నప్పుడు దే కాల్ మి ది కింగ్” అలాగే “దిస్ ఐడెంటిటీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దేన్ మనీ” అంటూ నాగార్జున చెప్పే సంభాషణలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని విలక్షణ కథాంశంతో దర్శకుడు రా. కార్తీక్ (Ra. Karthik) తెరకెక్కిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై అక్కినేని కుటుంబం అత్యంత వైభవంగా, భారీ బడ్జెట్‌తో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది. నాగార్జున 100వ సినిమా కావడం వల్ల మేకింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (DSP) సంగీతం అందిస్తున్నారు. నాగార్జున, డీఎస్పీ కాంబినేషన్లో గతంలో వచ్చిన మ్యూజికల్ హిట్స్ దృష్ట్యా, ఈ చిత్రంలో కూడా మాస్ ఊపుతెచ్చే పాటలతో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉండబోతోందని స్పష్టమవుతోంది. అన్ని విభాగాల్లోనూ అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు.
ఇక ఈ మోస్ట్ అవేటెడ్ ల్యాండ్‌మార్క్ మూవీ విడుదల తేదీని కూడా మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. 2026 డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. నాగార్జున 100వ చిత్రంపై టాలీవుడ్‌తో పాటు పాన్-ఇండియా వ్యాప్తంగా సినీ వర్గాల్లో మరియు అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది.