నాగార్జున 100వ సినిమా టైటిల్ ఏమిటో?
Nagarjuna
నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ప్రతిష్ఠాత్మకమైన 100వ చిత్రంలో నటిస్తున్నారు. కింగ్ 100 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొ ందిస్తున్నారు. రా కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ఆయన తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తమ అభిమాన హీరో 100వ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘నిన్నే పెళ్లాడతా’, ‘ఆవిడ మా ఆవిడే’ వంటి చిత్రాల్లో నాగార్జునతో కలిసి నటించిన టబు.. భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తో పాటు సినిమాకు సంబంధించిన వెల్లడించనున్నారు.ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: రా కార్తీక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.