ఫోర్బ్ ఇండియా కవర్‌పై అల్లు అర్జున్
Allu Arjun
జాతీయ అవార్డు గ్రహీత అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారతదేశంలోని టాప్ 100 ప్రముఖ సెలబ్రిటీలను సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్ ఇండియా ‘షో స్టాపర్స్ 2026’ ఎడిషన్ కవర్‌పై ఆయన తనదైన స్టైల్లో మెరిశారు. ఈ కవర్ పేజీ ద్వారా సెలబ్రిటీల ప్రభావం, క్రేజ్‌కు సంబంధించి అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన స్టార్డమ్ స్థాయి, బాక్సాఫీస్ వద్ద సత్తా, అలాగే ఒక స్టార్‌గా ఆయన అసాధారణమైన బ్రాండ్ వేల్యూ ఈ గుర్తింపుతో మరోసారి స్పష్టమైంది.తెలుగు సినిమా అల్లు అర్జున్ ప్రభావం ఎంత దూరం విస్తరించిందో చెప్పటానికి ఇదొక గొప్ప తిరుగులేని గుర్తింపు. నటన, వ్యక్తిత్వం, ప్రేక్షకులతో ఆయనకున్న అసాధారణ అనుబంధం.. ఈ అరుదైన కలయికే అల్లు అర్జున్ను జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో అప్పటికే ఉన్న ఆయన భారీ క్రేజ్ మరింత విస్తరించి, దేశవ్యాప్తంగా ఒక సాంస్కృతిక ప్రభంజనంగా మారింది. అల్లు అర్జున్ అద్భుతమైన ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఒక అసాధారణ ఫినామినన్గా అల్లు అర్జున్ సృష్టిస్తోన్న ప్రభంజనానికి ఇది మరో గొప్ప గుర్తింపుగా చెప్పొచ్చు.
- Vinayaka Chavithi 2026 Wishes In Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు అందమైన కొటేషన్స్ తో కూడి ఇమేజ్ గ్రీటింగ్స్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి..
- Ganesh Chaturthi 2026 Wishes in Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధు మిత్రులకు శ్లోకాలతో కూడిన ఈ కొటేషన్స్ వాట్సప్ ద్వారా షేర్ చేసుకోండి..
- Vinayaka Chavithi Wishes 2026: మీ బంధుమిత్రులకు వినాయక చవితి సందర్భంగా Whatsapp, SMS, X, Meta ద్వారా షేర్ చేయడానికి చక్కటి భక్తి భావంతో కూడిన Text Messeges మీ కోసం…
- Vinayaka Chavithi Wishes 2026: వినాయక చవితి శుభాకాంక్షలు .. మీకు మీ కుటుంబ సభ్యులకు 25 ప్రత్యేక శుభాకాంక్షలు
- తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు…మల్లు స్వరాజ్యం