Kharge Rally Row: ఖర్గే సభా వేదిక శుద్ధీకరణపై రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం.. FIR నమోదు చేయాలని డిమాండ్..
Kharge Rally Row
Kharge Rally Row: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రసంగించిన సభా ప్రాంగణంలో ‘శుద్ధీకరణ హవనం’ నిర్వహించడంపై లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం (ఆగస్టు 29, 2026) న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనను తీవ్రమైన “నేరం”గా అభివర్ణించిన ఆయన, బాధ్యులపై ఎస్సీ/ఎస్టీ (SC/ST) అట్రాసిటీ చట్టం కింద తక్షణమే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
2026 ఆగస్టు 8న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో ఉన్న రామ్‌లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ “విజయ్ శంఖనాద్” పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహించింది. ఈ ర్యాలీలో మల్లికార్జున్ ఖర్గే ముఖ్య అతిథిగా ప్రసంగించారు. ఖర్గే సభ ముగిసిన రెండు రోజులకే.. అదే రామ్‌లీలా మైదానంలో శ్రీరామ్ సేన సభ్యులు ‘శుద్ధీకరణ’ పేరుతో పూజలు, హవనం నిర్వహించినట్లు వార్తలు వచ్చాయి.
ఈ విచారకరమైన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించి.. తక్షణమే చట్టపరమైన చర్యలు మరియు ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆదేశించాలని రాహుల్ గాంధీ కోరారు. దళిత వర్గానికి చెందిన అగ్ర నాయకుడు ప్రసంగించిన స్థలాన్ని ‘శుద్ధీకరణ’ చేయడం రాజ్యాంగ విరుద్ధమని.. సమాజంలో కుల వివక్షను ప్రోత్సహించడమేనని కాంగ్రెస్ వర్గాలు మండిపడుతున్నాయి.
- Medical Cadre Dispute: తెలంగాణ–ఏపీ వైద్య ఉద్యోగుల కేడర్ వివాదం.. ఇద్దరు వైద్యులకు హైకోర్టులో షాక్.. సుప్రీంకోర్టులో పరిష్కరించుకోవాలని సూచన..
- పట్టభద్రులారా మేల్కోండి.. ఓటుహక్కు పొందండి!
- ‘దశహరా’కు వక్ర భాష్యాలు ఆపండి!
- పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ
- Saddula Bathukamma History: అసలు బతుకమ్మ పండుగ ఎందుకు జరుపుకుంటారు?..: ‘ఒక్కేసి పువ్వేసి చందమామ’ వెనుక ఉన్న కన్నీటి కథ ఇదే..