Danam Nagender: వీడియో ఇదిగో.. అలిగి వెళ్లిపోయిన దానం నాగేందర్.. ఖైరతాబాద్ ఇళ్ల లక్కీ డ్రాలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై సీరియస్..
Danam Nagender
Danam Nagender: హైదరాబాద్లోని బంజారాహిల్స్ కొమరం భీమ్ ఆదివాసీ భవన్లో నిర్వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గ డబుల్ బెడ్రూమ్ (గృహలక్ష్మి/ఇందిరమ్మ) ఇళ్ల లబ్ధిదారుల లక్కీ డ్రా కార్యక్రమంలో తీవ్ర ప్రోటోకాల్ రగడ చోటుచేసుకుంది. అధికారుల తీరుపై స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి, కార్యక్రమాన్ని మధ్యలోనే బహిష్కరించి అలిగి వెళ్లిపోయారు.
స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ సమక్షంలో ఈ లక్కీ డ్రా నిర్వహించాల్సి ఉంది. అయితే, ఆయన వేదిక వద్దకు రాకముందే అధికారులు ప్రక్రియను ప్రారంభించేశారు. తాను వచ్చే వరకు వ్యవధి ఇవ్వకుండా లక్కీ డ్రా ఎలా ప్రారంభిస్తారని ఎమ్మెల్యే అధికారులపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్, లక్కీ డ్రాను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పేదల ఇళ్ల కేటాయింపు ప్రక్రియ హైదరాబాద్ కోర్ అర్బన్ పరిధిలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో పారదర్శకంగా కొనసాగుతోంది. తొలి విడత కేటాయింపుల్లో భాగంగా ఈ లక్కీ డ్రా కార్యక్రమాన్ని మొత్తం నాలుగు రోజుల పాటు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
- Vinayaka Chavithi 2026 Wishes In Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు అందమైన కొటేషన్స్ తో కూడి ఇమేజ్ గ్రీటింగ్స్ ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోండి..
- Ganesh Chaturthi 2026 Wishes in Telugu: వినాయక చవితి సందర్భంగా మీ బంధు మిత్రులకు శ్లోకాలతో కూడిన ఈ కొటేషన్స్ వాట్సప్ ద్వారా షేర్ చేసుకోండి..
- Vinayaka Chavithi Wishes 2026: మీ బంధుమిత్రులకు వినాయక చవితి సందర్భంగా Whatsapp, SMS, X, Meta ద్వారా షేర్ చేయడానికి చక్కటి భక్తి భావంతో కూడిన Text Messeges మీ కోసం…
- Vinayaka Chavithi Wishes 2026: వినాయక చవితి శుభాకాంక్షలు .. మీకు మీ కుటుంబ సభ్యులకు 25 ప్రత్యేక శుభాకాంక్షలు
- తెలంగాణ సాయుధ పోరాటయోధురాలు…మల్లు స్వరాజ్యం