Skip to content
సంపాదకీయం వార్తలు

గ్రంథ సమీక్ష: ఎగిసిన ఉద్యమ తరంగం

Prajapaksham 05 Jul 2026 0 నిమిషాల పఠనం సంపాదకీయం
గ్రంథ సమీక్ష: ఎగిసిన ఉద్యమ తరంగం

గ్రంథ సమీక్ష: ఎగిసిన ఉద్యమ తరంగం

అఖిలభారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎఐఎస్‌ఎఫ్‌) 90 ఏళ్ల ఉజ్వల చరిత్రలో ఎన్నో మైలురాళ్లు, ఎన్నో పోరాటాలు, ఎన్నెన్నో త్యాగాలు, ఎన్నో విజయాలు. జాతీయోద్యమ కాలంలో బ్రిటీష్‌ వ్యతిరేక పోరాటంలో ఏకైక విద్యార్థి సంస్థగా ఏర్పడిన ఎఐఎస్‌ఎఫ్‌, స్వాతంత్య్రం అనంతరకాలంలో వేర్వేరు రాజకీయ పార్టీల వర్గ ప్రయోజనాలకు అనుగుణంగా చీలిపోయింది. ఆయా పార్టీలు తమ సొంత సంఘాలు ఏర్పాటు చేసుకున్నా యి. ఎఐఎస్‌ఎఫ్‌ బ్రాండ్‌ నేమ్‌ కమ్యూనిస్టులకు దక్కింది. సిపిఐలో 1964లో చీలిక తదుపరి కూడా ఎఐఎస్‌ఎఫ్‌ సిపిఐ మార్గదర్శకంలో నడిచే ప్రజాసంఘంగా కొనసాగుతున్నది. సిపిఐ (ఎం) ఎస్‌ఎఫ్‌ఐ ఏర్పాటు చేసుకుంది. అనంతరకాలం లో నక్సలైట్‌ గ్రూపులు పిడిఎస్‌యు, ఆర్‌ఎస్‌యు, డిఎస్‌ఒ పేర్లతో విద్యార్థులను ఆర్గనైజ్‌ చేశా కాంగ్రెస్‌కు ఉండనే ఉంది ఎన్‌ఎస్‌యుఐ. బిజెపి వారు ఎబివిపి ఏర్పరుచుకున్నారు. సోషలిస్టు పార్టీలకు విద్యార్థి సంఘాలున్నా అవి ఆ పార్టీలతోపాటు కాలగర్భంలో కలిసిపోయాయి. ఇన్ని విద్యార్థి సంఘాల మధ్య కాలేజీలు, యూనివర్శిటీల్లో ఆధిక్యతకోసం పోటీ ఉండే విద్యార్థులకు మెరుగైన విద్య, వసతులు కోసం ఉద్యమాలు సాగిస్తూ విద్యార్థి యూనియన్‌ ఎన్నికల్లో గెలిచి ఆధిక్యత నెలకొల్పుకునేందుకు ముమరంగా పోటీ ఉండేది. అవే ఒక రకంగా విద్యార్థి సంఘాలకు ప్రాణం పోశాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1983 తదుపరి ఎన్‌టిఆర్‌ ప్రభుత్వం విద్యార్థి యూనియన్‌ ఎన్నికలు రద్దుచేసింది. 1991లో నూతన ఆర్థిక విధానాలతో విద్యార్థుల్లో చదువుల్లో పోటీతత్వం పెరిగి ఉద్యమాల ఆలోచనకు దూరమైనారు. కాని 50ఏళ్ల క్రితం పరిస్థితులు వేరు.

సువర్ణాక్షరాలతో లిఖించదగిన ఎఐఎస్‌ఎఫ్‌ ప్రస్థానంలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక దశాబ్దకాలం (1971 జిల్లా, రాష్ట్రస్థాయిలో నాయకత్వం వహించిన డైనమిక్‌ లీడర్‌ పాళ్యం (పి) శ్రీనివాసులు నాయుడు. అనంతపురం జిల్లా గుంతకల్‌లో విద్యార్థి ధిక్కారంలో ఓనమాలు దిద్దుకున్న కార్యశూరుడు. “ఎఐఎస్‌ఎఫ్‌కు ఎడారిలాంటి అనంతపురం విద్యాలయాల్లో ఒయాసిస్సులనబడే శాఖలు నిర్మించాం. అవి ఇప్పటికీ చల్లగా, పచ్చగా వర్థిల్లుతున్నాయి. ఒక్కోరాయిని మలిచి, దాన్ని పొందికగాపెట్టి కట్టడానికి పడిన ఆనాటి కష్టాలను మరిచిపోరాదు. అలా చేతికి అందిన విజయఫలాల యొక్క మాధుర్యాన్ని అనంతపురం జిల్లా ఉద్యమం ఇప్పటికీ మధురంగా ఆస్వాదిస్తున్నది” అని ఉద్యమనేతగా తొలిదినాలను నాయుడు స్మరించుకున్నాడు.

1975 జూన్‌లో ప్రధాని ఇందిరాగాంధి దేశంలో అంతర్గత ఎమర్జెన్సీ విధించారు. మితవాద, మతవాద శక్తులనుంచి దేశానికి ప్రమాదాన్ని ఎదుర్కొనే పేరుతో సిపిఐ దాన్ని సమర్థించింది. మిగతా ప్రతిపక్ష పార్టీ ల నాయకులు జైళ్లలో పెట్టబడ్డారు. సిపిఐ నాయకులు మాత్రం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని సమర్థిస్తూ, ఆమె 20 అంశాల కార్యక్రమం అమలుకోసం పాదయాత్రలు చేబట్టారు. ఈ పంథా సిపిఐని ఏకాకిని చేసింది. ప్రజాస్వామిక శక్తులు చులకనభావం తో చూశాయి. పర్యవసానం ప్రజాసంఘాల కూ అది గడ్డుకాలం. ఈ నేపథ్యంలో 1976వ సంవత్సరంలో గుం టూరులో ఎఐఎస్‌ఎఫ్‌ 32వ రాష్ట్ర మహాసభ జరిగింది. వి.రామనరసింహారావును ప్రధాన కార్యదర్శిగా, శ్రీనివాసులు నాయుడును అధ్యక్షునిగా మహాసభ ఎన్నుకుంది. హైదరాబాద్‌లో ఏ వీధి ఎటు చేర్చుతుందో, ఏ విద్యాల యం ఎక్కడ ఉందో, అక్క డ పరిస్థితులేమిటో తెలియని అయోమయావస్థలో నగరంలో అడుగుపెట్టాడు ఈ నవ విద్యార్థి నాయకుడు. ఎమర్జెన్సీని బలపర్చినందుకు విద్యాలయాల్లో ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు, కార్యకర్తలపై ఇతర విద్యార్థి సంఘాల నాయకుల అవహేళనలు, అవమానాలు ఎన్నో. అప్పట్లో “హిమాయత్‌నగర్‌లో ఉన్న ఎఐఎస్‌ఎఫ్‌ ఆఫీసులో ఒంటరిగా కాలక్షేపం చేసిన, దిగులునిండిన రోజులు నాకు గుర్తున్నాయి” అన్నారు. అయి దిగాలుపడలేదు. కొంతకాలం ఓపిగ్గా అవకాశం కోసం ఎదురు చూశారు. అత్యంత న్యాయమైన, సమంజసమైన సాంఘి సంక్షేమ హాస్టల్‌ విద్యార్థుల సమస్యలపై పోరాటానికి ఎఐఎస్‌ఎఫ్‌ పావులు కదిపింది. అక్కడినుండి ఐక్య ఉద్య మ నిర్మాణానికి చేసిన కృషి, అనంతరం చలో అసెంబ్లీ సాగిన ఉద్వి గ్న ప్రయాణాన్ని కళ్లకు కడుతుందీ పుస్తకం. ఆయనకాలం ఉద్యమ సమకాలీకు లు పలువురు రాసిన సందేశ పూర్వక జ్ఞాపకాలు ఆనాటి జిల్లాల్లోని ఉద్యమాలను గుర్తు చేస్తాయి. ఆ రకంగా ఈ పుస్తకం చదువదగింది, ఈ తరం ఎఐఎస్‌ఎఫ్‌ కార్యకర్తలకు 50 ఏళ్లనాటి ఉద్యమ స్మృతులు స్ఫూర్తిదాయకం కూడా.

10 సంవత్సరాలు ఎఐఎస్‌ఎఫ్‌, 10సంవత్సరాలు ఎఐవైఎఫ్‌ రాష్ట్ర బాధ్యతలు, ఆ తదుపరి మరో 10 సంవత్సరాలపాటు రంగారెడ్డి జిల్లా సిపిఐ ఆర్గనైజర్‌గా శ్రీనివాసులునాయుడు చేసిన కృషి అతనికి మిలిటెంట్‌ నాయకునిగా గుర్తింపుతెచ్చిపెట్టాయి. కారణాలేవైనా, ఎర్రజండా నీడన వెలుగొందాల్సిన నాయకుడు పార్టీకి దూరమై ఈ తరం కమ్యూనిస్టులు ఎవరీ నాయుడు? అని ప్రశ్నించుకునే స్థితి కల్పించారు. అయితే ఆయన రచించిన పుస్తకం ఆవిష్కరణ పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్దూంభవన్‌లో జరగటం, పార్టీ జాతీయ నాయకుడు బినయ్‌ విశ్వం సహా ఎఐఎస్‌ఎఫ్‌ ఉద్యమ సహచరులు పలువురు పాల్గొనటం గతాన్ని గుర్తు చేస్తుంది. రంగారెడ్డిజిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి తాను చేసిన కృషిపై కూడా ఒక పుస్తకం రాయాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రజలే చరిత్ర నిర్మాతలని మార్కిజం చెబుతుంది. అయితే నాయకుల పాత్రను అది విస్మరించలేదు.

మక్కెస సుబ్బారావు
ఎడిటర్‌, ప్రజాపక్షం దినపత్రిక
హైదరాబాద్‌

ట్యాగ్‌లు: editorial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *