Skip to content
బిజినెస్ వార్తలు

Tourism: గోవా వెళ్లాల్సిన పనిలేదు… హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న సముద్రపు బీచ్ ఇదే…

Prajapaksham 05 Jul 2026 0 నిమిషాల పఠనం బిజినెస్
Tourism: గోవా వెళ్లాల్సిన పనిలేదు… హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న సముద్రపు బీచ్ ఇదే…

Tourism: గోవా వెళ్లాల్సిన పనిలేదు… హైదరాబాద్ కు అత్యంత సమీపంలో ఉన్న సముద్రపు బీచ్ ఇదే… ( Image Source: X.com)

వీకెండ్ వచ్చిందంటే చాలు సేద తీరేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు యువత ఏ మాత్రం వెనుకాడరు. ముఖ్యంగా వీకెండ్ సమయాల్లో బీచ్ లో సేద తీరాలని చాలామంది కలలు కంటూ ఉంటారు. దీనికోసం ఎంతో ఖర్చు పెట్టుకుని మరి గోవాకు వెళుతుంటారు. హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లాలంటే చాలా దూరంగా ఉండటంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. పైగా సీజన్లో రూములు, రైల్లో సీట్లు లభించవు. మరి హైదరాబాద్ నగరంలో ఉంటూ కేవలం ఒకరోజు టైం లోనే పొద్దున వెళ్లి రాత్రికి తిరిగి రాగలిగే సముద్రపు బీచు గురించి ఇఫ్పుడు మనం తెలుసుకుందాం. హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి సముద్ర తీరం బాపట్ల. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బాపట్ల ప్రాంతం హైదరాబాద్ నుంచి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడే ఉన్నటువంటి సూర్యలంక బీచ్ పర్యటకులకు ఎంతో అనుకూలంగా ఉండే బీచ్ గా చెప్పవచ్చు. ప్రకృతి రమణీయ దృశ్యాలకు సూర్యలంక బీచ్ చాలా అనువైనదిగా చెప్పవచ్చు. హైదరాబాద్ నగరానికి చాలా సమీపంలో ఉండటంతో పాటు నగరం నుంచి లాంగ్ డ్రైవ్ చేస్తూ వెళ్లే వారికి అత్యంత అనువైనదిగా చెప్పవచ్చు.

సూర్యలంక బీచ్ హైదరాబాద్ నగరం నుంచి సుమారు 315 కిలోమీటర్ల దూరంలో ఉంది. అంతేకాదు ఇక్కడికి బస్సు ట్రైన్ సౌకర్యం కూడా ఉంది. అలాగే ఎవరైతే కారులో ప్రయాణిస్తారో వారికి విజయవాడ హైవే ద్వారా నేరుగా చేరుకునే అవకాశం కూడా ఉంది. సూర్యలంక బీచ్ లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ నిర్మించిన కాటేజీలో సముద్రపు తీరంలోనే ఉంటాయి ఇక్కడ ప్రశాంతమైన సముద్రాన్ని చూస్తూ సూర్యోదయం చూడవచ్చు. ఇది ఒక అద్భుతమైన మధురమైన అనుభూతిని ఇక్కడికి వచ్చిన పర్యటకులు చెబుతుంటారు. సముద్ర తీరాల్లో ఎంజాయ్ చేసేవారికి ఇది ఒక చక్కటి డెస్టినేషన్ గా చెప్పవచ్చు. వేలాది రూపాయలు ఖర్చు చేస్తూ గోవాకు వెళ్లే బదులు సూర్యలంక బీచ్ ఒకసారి వెళ్లి ఎంజాయ్ చేయవచ్చని పర్యటకులు చెబుతుంటారు. హైదరాబాద్ నగరానికి అత్యంత సమీపంలో ఉన్నటువంటి సముద్రపు తీరాల్లో సూర్యలంక బీచ్ ఒకటిగా చెప్పవచ్చు.

ఇప్పటికే హైదరాబాద్ నగరానికి చెందిన ఐటీ ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, వీకెండ్ సమయాల్లో సూర్యలంక బీచ్ వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు సూర్యలంక ప్రస్తుతం పర్యాటకులకు ఆహ్వానం అందించడంలో చాలా ముందంజలో ఉంది అని చెప్పవచ్చు. స్థానికంగా చక్కటి రిసార్ట్లతోపాటు, రాష్ట్ర ప్రభుత్వ పర్యాటక సంస్థ నిర్వహించే కాటేజీలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి అని చెప్పవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం నుంచి రెగ్యులర్ గా సూర్యలంక బీచ్ వరకు వెళ్లేందుకు, ఏపీఎస్ఆర్టీసీ హైదరాబాద్ టు బాపట్ల మధ్య బస్సు సర్వీసులను నిర్వహిస్తోంది. బాపట్ల బస్టాండ్ నుంచి ఆటో ద్వారా లేక టాక్సీ ద్వారా నేరుగా సూర్యలంక బీచ్ వెళ్లవచ్చు. అలాగే రైలు ద్వారా ఎవరైనా బాపట్ల వెళ్లాలి అనుకునే వారికి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బాపట్ల స్టేషన్ కు వెళ్లే రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

ట్యాగ్‌లు: travel and tourism

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *