Skip to content
సినిమా వార్తలు

త్రిష కృష్ణన్ సీరియస్…అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ జారా చేసిన కంపు పనితో తీవ్ర ఆగ్రహం..

Prajapaksham 05 Jul 2026 0 నిమిషాల పఠనం సినిమా
త్రిష కృష్ణన్ సీరియస్…అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ జారా చేసిన కంపు పనితో తీవ్ర ఆగ్రహం..

trisha krishnan (Image Source: x.com)

ప్రముఖ నటి సౌత్ ఇండియా బ్యూటీ త్రిష కృష్ణన్ మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు సోషల్ మీడియా వేదికగా ఒక అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. అంతేకాదు తనకు ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టిన దుస్తుల నుంచి దుర్గంధం వస్తోందని, అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాల్సిన సంస్థలు సైతం ఇలాంటి దుస్తులను పంపడం సిగ్గుచేటని ఆమె తీవ్రంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే త్రిష ఇటీవల తాను ఆర్డర్ చేసిన ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ జారా పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు. జారా ఒక ప్రముఖమైన ఫ్యాషన్ దుస్తుల బ్రాండ్ ఈ ఫ్యాషన్ బ్రాండ్ ద్వారా తాను ఆన్లైన్లో మూడుసార్లు దుస్తులను బుక్ చేసుకోగా, దుర్గంధంతో కూడిన దుస్తులు తనకు లభించాయని త్రిష ఈ సందర్భంగా వాపోయారు. ఇలా ఒక్కసారి మాత్రం జరగలేదని వరుసగా మూడుసార్లు కూడా ఇలానే జరిగిందని తన అనుభవాలను ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ రూపంలో షేర్ చేసుకున్నారు.

ఆమె సదరు జరా బ్రాండ్ ను ట్యాగ్ చేస్తూ దయచేసి మేము హోమ్ డెలివరీ కోసం ఆర్డర్ చేసిన దుస్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే ఆర్డర్ చేసిన దుస్తుల నుంచి దుర్వాసన వస్తోంది. ఇలా మొదటిసారి కాదు వరుసగా మూడుసార్లు ఇలాంటి ఘటన ఎదురైంది. కనీసం మీరు ప్యాక్ చేసే సమయంలో అయినా జాగ్రత్తలు పాటించి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు అని ఆమె పేర్కొన్నారు. మీరు ప్యాక్ చేసే ముందు ఒకసారి ప్రోడక్ట్ని పరిశీలించి ఆ తర్వాత మాత్రమే కస్టమర్లకు డెలివరీ చేయాలని ఆమె ఈ సందర్భంగా సూచన చేశారు. అయితే ఇలాంటి పరిస్థితి రావడం చాలా అసహ్యంగా ఉందని కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

ఇదిలా ఉంటే త్రిష ఇటీవల తమిళనాడు రాజకీయాల్లో సైతం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆమె తమిళనాడు ముఖ్యమంత్రి జోసఫ్ స్టాలిన్ తో తరచూ కనిపిస్తూ వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలకు ఊతం అందిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార బాధ్యతలు చేపట్టే సమయంలో కూడా త్రిష ఆ కార్యక్రమంలో ప్రత్యేకంగా కనిపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పెట్టిన ఒక పోస్టు సంచలనానికి తెరలేపింది. ఆ పోస్టులో ఆమె అర్ధరాత్రి 12 గంటలకు సీఎం విజయ్తో కేక్ కట్ చేస్తున్నట్లు ఫోటోను పోస్ట్ చేశారు. అంతేకాదు కేకు కట్ చేసే సమయాన్ని కూడా ఆ పోస్టులో ఆమె పేర్కొన్నారు. ఇది తీవ్ర దుమారానికి దారితీసింది. మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సైతం తన భార్య సంగీతతో విడాకులకు అప్లై చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జోసఫ్ విజయ్, త్రిష కృష్ణన్ త్వరలోనే పెళ్లి చేసుకొని ఒకటవుతారనే వార్త అటు కోలీవుడ్లో కూడా కోడై కూస్తోంది.

ట్యాగ్‌లు: Telugu cinema news Trisha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *