Skip to content
సినిమా వార్తలు

అఖిల్ లెనిన్ సినిమా స్టోరీ లీక్…ఇండస్ట్రీలో ఏ హీరో చేయని సాహసం అఖిల్ చేస్తున్నాడా..?

Prajapaksham 05 Jul 2026 0 నిమిషాల పఠనం సినిమా
అఖిల్ లెనిన్ సినిమా స్టోరీ లీక్…ఇండస్ట్రీలో ఏ హీరో చేయని సాహసం అఖిల్ చేస్తున్నాడా..?

అఖిల్ లెనిన్ సినిమా స్టోరీ లీక్. (Image source: @AkhilAkkineni8/x.com)

అక్కినేని వారసుడు అఖిల్ తన ఆశలన్నీ తాజాగా రిలీజ్ కాబోయే లెనిన్ సినిమా పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమా విజయం ఆయన సినీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్కినేని నాగార్జున వారసుడిగా అఖిల్ ఇప్పటికే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పది సంవత్సరాలు గడిచిపోయింది. అయినప్పటికీ ఇప్పటి వరకు ఒక్కసారి అఖిల్ కు పడకపోవడం అక్కినేని అభిమానులకు ఒక తీరని కోరికగా మిగిలిపోయింది. అఖిల్ సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా మాత్రమే ఒక మోస్తారు విజయాన్ని అందుకుంది.

ఇక అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఇచ్చిన షాక్ నుంచి కోలుకోవడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. ఏజెంట్ తర్వాత అఖిల్ చేస్తున్న సినిమా లెనిన్, పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా అఖిల్ ఇమేజ్ చేంజ్ ఓవర్ అని చెబుతున్నారు. ప్రస్తుతం అఖిల్ చేస్తున్నటువంటి ఈ విలేజ్ డ్రామా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది అభిమానుల విపరీతమైన టెన్షన్ కల్పిస్తోంది. అఖిల్ కు ఇది కొత్త జానర్ కావడంతో పాటు ప్రస్తుతం అఖిల్ చేస్తున్న ఒక కొత్త ప్రయోగంగా కూడా చెప్పవచ్చు.

నిజానికి ఇండస్ట్రీలో అఖిల్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు, అతడి లుక్స్ ఎనర్జీ డాన్స్ చూసి ఇండస్ట్రీలో టైర్ వన్ హీరో అవుతాడని అంతా భావించారు. యాక్షన్ హీరో అవుతాడని అనుకున్న చివరకు లవర్ బాయ్ ఇమేజ్ అయినా సొంతం చేసుకుంటాడని అంతా భావించారు. ఇండస్ట్రీలోకి వచ్చి పది సంవత్సరాలు గడిచిన ఇప్పటికి ఓనమాలు దగ్గరే మిగిలిపోవడం అక్కినేని అభిమానులకు తీవ్ర నిరాశ కల్పిస్తోంది అని చెప్పవచ్చు. ఇక తాజాగా విడుదలకు సిద్ధం అవుతున్న లెనిన్ సినిమా చక్కటి విజయం అందుకుంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ సినిమా కథ విషయానికి వస్తే మరొక అదిరిపోయే అప్డేట్ కూడా బయట సర్కిల్స్ లో వినిపిస్తోంది.

పరువు హత్యల నేపథ్యంలో ఈ కథను రాసుకున్నారని తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చోటు చేసుకున్న కొన్ని వాస్తవ సంఘటనలను తీసుకొని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఒక చక్కటి స్టోరీ రాసుకున్నాడని, ఈ సినిమాలో హీరో హీరోయిన్ ను చంపడంతో కథ మొదలవుతుందని సినిమా వర్గాల్లో ఒక లీక్ స్టోరీ సర్కిల్ అవుతోంది. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటివరకు తెలుగు స్క్రీన్ మీద ఎవరు చేయని సాహసం కథ పరంగా అఖిల్ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది.

పూర్తిగా రాయలసీమ బ్యాగ్రౌండ్ లో వస్తున్నటువంటి ఈ సినిమా హీరో పేరు లెనిన్ అని పెట్టడం వెనుక అసలు రహస్యం హీరో అఖిల్ ప్రత్యక్షంగా చెప్పడం విశేషం. దర్శకుడు అబ్బూరు మురళి రాయలసీమలోని ఒక గ్రామానికి చెందిన వాడని ఆ గ్రామంలో చాలా మంది కమ్యూనిస్టు పార్టీ తో అనుబంధం ఉండటం వల్ల చాలామందికి లెనిన్ బాబు, స్టాలిన్, పేర్లు ఉన్నాయని, అయితే అదే గ్రామానికి చెందిన లెనిన్ బాబు అనే క్యారెక్టర్ నుంచి స్ఫూర్తి పొంది ఈ కథ రాసుకోవడం జరిగిందని ఆయన చెప్పారు. జూలై 10వ తేదీన విడుదల కానున్న లెనిన్ సినిమా కోసం అక్కినేని అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *