Skip to content
సంపాదకీయం వార్తలు

తెలంగాణ సంస్కృతికి సజీవ దర్పణం ‘యాది’

Prajapaksham 05 Jul 2026 1 నిమిషాల పఠనం సంపాదకీయం
తెలంగాణ సంస్కృతికి సజీవ దర్పణం ‘యాది’

తెలంగాణ సంస్కృతికి సజీవ దర్పణం ‘యాది’ ( Photo Credit: Samala Sadashiva / Meta)

– సుధాకర్‌.
స్టేట్‌ టీచర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు

తెలంగాణ సాహిత్య లోకంలో సంస్కృతీ సంప్రదాయాలకు, భాషా సౌరభాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన మహోన్నత గ్రంథం సామల సదాశివ రాసిన ‘యాది’. నిజానికి ‘యాది’ అంటే తెలంగాణ మాండలికంలో ‘జ్ఞాపకం’ అని అర్థం. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహుభాషా కోవిదుడైన సామల సదాశివ గారు తన జీవితకాలంలో చూసిన మనుషులను, అనుభవించిన క్షణాలను, విన్న సంగీతాన్ని, చవిచూసిన ఉర్దూ-తెలుగు భాషల అనుబంధాన్ని అత్యంత ఆర్ద్రతతో అక్షరబద్ధం చేసిన అపురూప జ్ఞాపకాల సంపుటి ఇది. అంటే కేవలం ఊ హల్లో విహరించడం కాదు, గడిచిన కాలాన్ని, ఆ కాలపు మనుషుల ఉదాత్తతను భవిష్యత్‌ తరాలకు అందించడం అని నిరూపించిన గ్రంథం ‘యాది’. ఈ వ్యాస సంకలనంలో సదాశివ గా రు కేవలం తన వ్యక్తిగత జ్ఞాపకాలను మాత్రమే రాయలేదు. నిజాం పాలన కాలం నాటి సామాజిక వాతావరణాన్ని, తెలంగాణ మట్టి వాసనల ను, హిందూ-ముస్లింల సామరస్యపూర్వక జీవనాన్ని, నాటి ఉర్దూ కవుల (షాయిర్ల) గొప్పతనా న్ని కళ్లకు కట్టారు. తెలంగాణ అస్తిత్వాన్ని, భా షా వైభవాన్ని తెలుసుకోవడానికి ‘యాది’ ఒక తిరుగులేని చారిత్రక సాక్ష్యంగా నిలుస్తుంది.

సామల సదాశివ గారికి తెలుగుతో పాటు ఉర్దూ, పారశీక, అరబిక్‌, మరాఠీ, హిందీ భాష అపారమైన ప్రవేశం ఉంది. ‘యాది’ గ్రంథం లో ఆయన ఉర్దూ భాషా సౌందర్యాన్ని, తెలుగు భాషా మాధుర్యాన్ని ఒకదానితో ఒకటి ముడిపెడుతూ సాగిన తీరు అద్భుతం. నాటి హైదరాబాద్‌ సంస్థానంలో ఉర్దూ అధికార భాషగా ఉన్నప్పటికీ, లౌకిక సంస్కృతి ఎలా వర్ధిల్లిందో ఆ యన వివరించారు. ఉర్దూ కవులైన గాలిబ్‌, ఇ క్బాల్‌, దాగ్‌ వంటి వారి కవిత్వాన్ని, వారి జీవితాల్లోని ఉదాత్తమైన ఘట్టాలను తెలుగు పాఠకులకు ఎంతో ఆత్మీయంగా పరిచయం చేశారు. గారి రచన శైలి ఒక ఆత్మీయ సంభాషణ లా సాగుతుంది. క్లిష్టమైన గ్రాంథిక భాష జోలికి పోకుండా, పక్కన కూర్చొని తాతయ్య కథలు చెప్తున్నట్లుగా సరళమైన తెలంగాణ ఉర్దూ మిశ్రి త తెలుగులో ‘యాది’ సాగుతుంది. తెలంగాణ నుడికారం, సామెతలు, జాతీయాలను ఆయన ఎంతో సహజంగా వాడారు. పరభాషా పదాల ను కూడా తెలుగీకరించి,భాషా భేదాలు లేకుం డా అక్షర రూపం ఇచ్చారు. ఈ గ్రంథం చదువుతుంటే నాటి ఆదిలాబాద్‌, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల భాషా జీవనం కళ్లముందు కదలాడుతుంది. లో సదాశివ గారు కేవలం పెద్ద పెద్ద ప్రముఖుల గురించే కాకుండా, సమాజం గుర్తింపుకు నోచుకోని ఎందరో ప్రతిభావంతులైన కళాకారులను, కవులను లోకానికి పరిచయం చేశారు. హిందుస్తానీ సంగీతంతో తనకు అనుబంధాన్ని, నాటి గజల్‌ గాయకుల ప్రతిభను ఆయన అద్భుతంగా వర్ణించారు. తన జీవితాన్ని ప్రభావితం చేసిన గురువులను, స్నేహితులను, అనామక కవులను కూడా ఈ గ్రంథంలో ఎంతో గౌరవంతో స్మరించుకున్నారు. వారిలోని మానవత్వాన్ని, కళా హృదయాన్ని ఆవిష్కరించడం ద్వారా నాటి సమాజపు విలువలను మనకు గుర్తుచేశారు.

రాజకీయ లబ్ధి కోసం మనుషుల మధ్య గోడలు కడుతున్న నేటి సమాజానికి ‘యాది’ ఒక గొప్ప మార్గదర్శి. నిజాం కాలంలో హిందువులు, ముస్లింలు ఒకరి పండుగలను ఒకరు గౌరవించుకుంటూ, కలిసిమెలిసి జీవించిన లౌకిక వాతావరణాన్ని సదాశివ గారు ఎంతో ప్రామాణికంగా నమోదు చేశారు. మతం ఏదైనా మానవత్వం, కళలే పరమావధిగా బతికిన నాటి మనుషుల నిష్కల్మష హృదయాలను ఆయన ఆవిష్కరించారు. గ్రంథంలో సదాశివ గారు చిత్రించిన వ్యక్తులు కేవలం చారిత్రక పాత్రలు కారు, వారు మానవీయ విలువలకు నిలువెత్తు రూపా లు. సమాజంలో పెద్దగా పేరు ప్రఖ్యాతులు లేకపోయినా, తమ నిష్కల్మషమైన ప్రేమతో, ఇతరులకు సహాయం చేసే గుణంతో నలుగురి హృదయాల్లో నిలిచిపోయిన ఎందరో సామాన్యుల జీవితాలను ఆయన ‘యాది’ చేసుకున్నారు. కు లమతాలకు అతీతంగా నాటి గ్రామీణ, పట్టణ జీవితాల్లో మనుషుల మధ్య వికసించిన ఆత్మీయ బంధాలను, కష్టసుఖాల్లో తోడుండే తత్వాన్ని ఆ యన ఎంతో ఆర్థ్రతతో నిరూపించారు. యాంత్రికంగా మారిపోతున్న నేటి తరానికి ఆనాటి మ నుషుల అంతరంగ సంస్కారం ఎంత గొప్పదో ఈ పాత్రల ద్వారా మనకు అర్థమవుతుంది.

సామల సదాశివ గారి ‘యాది’ కేవలం గతకాలపు జ్ఞాపకాల సమాహారం మాత్రమే కాదు; అది ఒక సంస్కృతికి, ఒక భాషా వికాసానికి దర్పణం. మారుతున్న కాలంలో మనం కోల్పోతున్న ఆత్మీయతలను, మానవీయ విలువలను ఈ గ్రంథం మనకు తిరిగి గుర్తుచేస్తుంది (యాది చేస్తుంది). తెలంగాణ సాహిత్య చరిత్రలో సదాశివ గారు అందించిన ఈ ‘యాది’ నిలిచేంతవరకు, నాటి కాలపు మనుషుల ఉదాత్తత, ఉర్దూ-తెలుగుల సమ్మేళన సంస్కృతి పాఠకుల హృదయాల్లో సజీవంగానే ఉంటాయి.

ట్యాగ్‌లు: editorial