Skip to content
తెలంగాణ వార్తలు

Telangana Weather Forecast: వచ్చే 7 రోజులు తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఇవే.

Prajapaksham 05 Jul 2026 1 నిమిషాల పఠనం తెలంగాణ
Telangana Weather Forecast: వచ్చే 7 రోజులు తెలంగాణలో వాతావరణం ఎలా ఉండబోతోంది? పూర్తి వివరాలు ఇవే.

Telangana Weather Forecast

రాష్ట్రంలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. ఆదివారం మధ్యాహ్నం విడు దల చేసిన తాజా బులెటిన్ ప్రకారం, తెలంగాణలో అనేక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా ఇదే వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. జులై 6 నుంచి 7 వరకు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముండగా, అన్ని జిల్లాల్లో గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశ ముందన్నారు. మంగళ, బుధవారం వరకు ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవ కాశముందని, మిగిలిన జిల్లాల్లో బలమైన గాలులు వీచే అవకాశముం దని తెలిపారు.

బుధవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశముందన్నారు. శుక్రవారం నుంచి ఆదివారం వరకు కూడా రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవ కాశం ఉన్నప్పటికీ, ప్రత్యేక హెచ్చరికలు ఏవీ లేవన్నారు. హైదరాబాద్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నప్పటికీ, రాష్ట్రవ్యా ప్తంగా విస్తారమైన వర్షాలు కురిసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదన్నారు.

మరో రెండు రోజుల తర్వాత వర్షాల తీవ్రత మరింత తగ్గి, చాలా ప్రాంతాల్లో తాత్కాలిక విరామం లభించే అవకాశముందన్నారు. మొత్తం మీద ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్లో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నందున రైతులు, ప్రజలు అధికారిక వాతావరణ బులెటిన్లను అనుసరిస్తూ అప్రమత్తంగా ఉండా లని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.