Skip to content
Uncategorized వార్తలు

హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

Prajapaksham 17 Jun 2026 0 నిమిషాల పఠనం Uncategorized
హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

MLA Kunamneni Sambasiva Rao Warns Government Over Delay in Fulfilling Assurance

*ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులే

*గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే ప్రభుత్వానికి తిరుగుబాటు తప్పదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. హనుమకొండలోని గుండ్లసింగారం భూపోరాట కేంద్రంలో మంగళవారం సురవరం సుధాకర్ రెడ్డి నగర్ పేరుతో నిర్మించిన సిపిఐ కార్యాలయాన్ని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు ఇస్తామని చెప్పి నేడు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా పేదవాడి జీవితం మార లేదని అన్నారు.

పేదలు సిపిఐ ఆధ్వర్యంలో అనేక చోట్ల భూపోరాటాలు నిర్వహించి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రజాసమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. పాలకులు పేదల అనుకూల విధానాలను అవలంబించడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొన వద్దంటూ పేదలకు నీతులు చెబుతూ పెద్దలకు అనుకూలంగా మెదులుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టుల మద్దతు ఉంటేనే ప్రభుత్వాలు మనగలుగుతాయని అన్నారు. కమ్యూనిస్టులు లేకుంటే తెలంగాణాకే విముక్తి జరిగేది కాదని అన్నారు.

గుండ్ల సింగారంలో ఎంతో దీక్ష, పట్టుదలతో కాలనీ నిర్మించుకుని అందరికీ ఆదర్శంగా నిలిచారని, కాలనీలో నివసిస్తున్న పేదలందరికీ ఇండ్ల పట్టాలు వచ్చేలా తాను అధికారులతో, స్థానిక ఎమ్మెల్యేతో అవసరం అయితే సీఎంతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ గుడిసెవాసులకు సిపిఐ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కాలనీలో కరెంట్, తాగునీరు, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శులు తోట బిక్షపతి, మద్దెల ఎల్లేష్, రాష్ట్ర సమితి సభ్యులు అదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, వలీ ఉల్లాఖాద్రి, హనుమకొండ మండల కార్యదర్శి ఎన్ ఎ స్టాలిన్, జిల్లా నాయకులు ఉట్కూరి రాములు, కర్రె లక్ష్మణ్, బత్తిని సదానందం, మునిగాల బిక్షపతి, మాలోత్ శంకర్, శనిగరపు రాజు కుమార్, కొట్టే వెంకటేష్, వేల్పుల సారంగపాణి, అనుకారి అశోక్, రాసమల్ల దినా, మండల సహాయ కార్యదర్శి గుంటి రాజేందర్, గ్రామ పెద్దలు మాదాసి కళ్యాణ్, గాదె రాజన్న, కట్కూరి కృష్ణ, జన్ను కృష్ణ, నాయకులు పోనుగోటి రాము గోపాల్ చారి, పూజారి అమృతయ్య, కట్కూరి కృష్ణ, కొడెపాక బాబు, మామునూరి దామోదర్, గుడికందుల శివ, పూజారి నరేందర్, కేతపాక ప్రసాద్, తాటికొండ ప్రశాంత్, మాలోత్ మంగ, బైసా మౌనిక, నలువాల సంధ్య, తాటికంటి మమత, గుంటి రజిత, వందలాది ఇండ్ల వాసులు తదితరులు పాల్గొన్నారు. ప్రజానాట్య మండలి నాయకులు గడ్డం రాజనర్సు, రోంటాల శ్యామ్, కేతపాక ప్రసాద్, తాటికంటి మమత, ప్రముఖ సినీ గాయకుడు ఇమ్మడి అశోక్ పాటలు, మహిళల కోలాట నృత్యం ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *