టెట్ స్టడీ మెటీరియల్ ఆవిష్కరించిన SCERT డైరెక్టర్
TET study material released by SCERT Director
వచ్చే నెలలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్) పరీక్షకు హాజరయ్యే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం స్టేట్ టీచర్స్ యూనియన్ తెలంగాణ స్టేట్ (STUTS) అధ్వర్యంలో రూపొందించిన స్టడీ మెటీరియల్ ను మంగళవారం SCERT డైరెక్టర్, టెట్ కన్వీనర్ జి. రమేష్ ఆవిష్కరించారు.
ఉపాధ్యాయుల సామాజిక బాధ్యతతో పాటు ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇన్-సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టెట్ స్టడీ మెటీరియల్ ముద్రించి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు.
సంఘ రాష్ట్ర అధ్యక్షులు జి. సదానందం గౌడ్ మాట్లాడుతూ, పేపర్-1, పేపర్-2లకు సంబంధించి 5,000 సెట్లు ముద్రించినట్లు తెలిపారు. ఒక్కో సెట్‌లో ఆరు పుస్తకాలు ఉంటాయని, వీటిని రాష్ట్రంలోని 33 జిల్లా శాఖల ద్వారా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచామని తెలిపారు. స్పెషల్ టెట్‌కు హాజరయ్యే దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులు ఈ స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ జుట్టు గజేందర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు శ్రీ ఎం. పర్వత్ రెడ్డి, సంఘ మాస పత్రిక ఎడిటర్ ఎల్. యం. ప్రసాద్ పాల్గొన్నారు.
- Erravalli Lands: ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. సర్వే నంబర్ 325లో తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణానికి ఆదేశం..
- Bathukamma Celebrations 2026: బతుకమ్మ పండుగ తేదీలు.. అక్టోబర్ 10 నుంచి అక్టోబర్ 18 వరకు 9 రోజులు పాటు ఉత్సవాలు.. ఏ రోజు ఏ పేరుతో పిలుస్తారంటే..
- Telangana ACB Bribe Cases: అవినీతి సొమ్ముతో ఏసీబీకి అడ్డంగా దొరుకుతున్న అధికారులు.. రూ.4 లక్షల లంచంతో GHMC అధికారి, రూ.1 లక్ష కేసులో DMHO అరెస్ట్..
- Who is Neha Bora? ఎవరీ నేహా బోరా..? జంతర్ మంతర్ ఆందోళనల్లో మెరిసిన ధిక్కార స్వరం.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటి?
- Dussehra 2026: దసరా తొలి రోజు అమ్మవారి అవతారం.. శైలపుత్రి దేవి వెనుక కథ ఇదే..