Hyderabad Weather Today: హైదరాబాద్ వాతావరణం.. వర్షాలకు సిద్ధంగా ఉండండి.. ఐఎండీ యెల్లో అలర్ట్..
Hyderabad Weather Today
Hyderabad Weather Today: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ముసురు వాతావరణం నెలకొంది. హైదరాబాద్ వాతావరణం విషయానికి వస్తే.. భాగ్యనగరంలో పగటిపూట అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురుస్తుండగా, ఆకాశం రోజంతా మేఘావృతమై ఉంటోంది. ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా 28°C నుండి 29°C వరకు, కనిష్ఠంగా 24°C వరకు నమోదవుతున్నాయి. గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటంతో పాటు పశ్చిమ దిశ నుండి ఈదురుగాలులు వీస్తున్నాయి.
భారత వాతావరణ కేంద్రం (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రోజు (ఆగస్టు 4) తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.
రాజధాని హైదరాబాద్ నగరం, పరిసర ప్రాంతాలలో రాబోయే కొద్ది రోజుల్లో తేలికపాటి నుండి మోస్తరు జల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆగస్టు రెండవ వారంలో బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడే అల్పపీడన వ్యవస్థల కారణంగా రాష్ట్రంలో వర్షాల తీవ్రత మళ్లీ పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. రహదారులు తడిగా ఉండే అవకాశం ఉన్నందున వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని నిపుణులు సూచిస్తున్నారు.
- TRAI New Rules: డేటా అవసరం లేని వారికి గుడ్‌న్యూస్.. కేవలం కాల్స్, SMS కోసం తక్కువ కాలపరిమితి రీఛార్జ్‌లు..
- Telangana Rains: తెలంగాణ రాష్ట్రంలో దంచికొట్టనున్న వానలు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
- Telangana SIR: తెలంగాణలో ఓటర్లకు అలర్ట్.. 43 లక్షల మంది ఓట్లు గల్లంతయ్యే ప్రమాదం.. స్పందించకపోతే తుది జాబితా నుంచి తొలగింపు
- Andhra Pradesh Rain Alert: ఏపీకి రెడ్ అలర్ట్.. దూసుకొస్తున్న వాయుగుండం.. రేపు రాత్రి విశాఖ–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం..
- Khairatabad Ganesh Darshan: భక్తులకు అలర్ట్.. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం రేపు అర్ధరాత్రి వరకే.. 23 తర్వాత భక్తులకు నో ఎంట్రీ.. 25న నిమజ్జనం..