‘ఇట్లు అర్జున’ మ్యూజికల్ కాన్సర్ట్ లో రామ్ చరణ్
Ram Charan
కింగ్ నాగార్జున సమర్పణలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇట్లు అర్జున’. అనీష్ హీరోగా పరిచయం అవుతుండగా, అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తున్నారు. మహేష్ ఉప్పల ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. దర్శకుడు వెంకీ కుడుముల ఈ సినిమాతో నిర్మాతగా కూడా పరిచయం అవుతున్నారు. ఆయన కొత్తగా ప్రారంభించిన వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలని పెంచంది. ఎస్ తమన్ అందించిన పాటలన్నీ చార్ట్ బస్టర్ అయ్యాయి. ‘ఇట్లు అర్జున’ నవంబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యూజికల్ కాన్సర్ట్ నిర్వహించారు. కింగ్ నాగార్జున, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, అఖిల్ అక్కినేని ముఖ్య అతిథులు పాల్గొన్న ఈ వేడుక జరిగింది.
రామ్ చరణ్ మాట్లాడుతూ ‘ఇట్లు అర్జున’తో తనకు ఒక బ్లాక్‌బస్టర్ వస్తుంది. అలాగే సంక్రాంతికి ‘కాకా’తో మరో బ్లాక్‌బస్టర్ వస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. తమన్ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సినిమాకైనా, అనిష్ ‘ఇట్లు అర్జున’కైనా సమానంగా మ్యూజిక్ చేస్తారు. నేను కూడా ‘రంగస్థలం’ సినిమాలో చెవిటివాడిగా నటించాను. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అంతకంటే పెద్ద విజయం ఈ సినిమాతో అనీష్‌కు రావాలని కోరుకుంటున్నాను. నాగార్జున మాట్లాడుతూ సినిమా చాలా బాగుంది. తన కళ్లతో మాట్లాడాడు. తన సైలెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. అనీష్, అనస్వర కెమిస్ట్రీ సినిమాలో చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అలాగే తమన్ ఇచ్చిన ప్రతి పాట హిట్ అయింది. నవంబర్ 13న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అనీష్ ప్రేమ మీ అందరికీ వినిపిస్తుంది. సినిమా విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. ఈ సినిమా మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హీరో అఖిల్ అక్కినేని , హీరో అనీష్ , హీరోయిన్ అనస్వర రాజన్ , మ్యూజిక్ డైరెక్టర్ తమన్, నిర్మాత రవిశంకర్ ,
ఎఫ్ డీ సి చైర్మన్, నిర్మాత దిల్ రాజు , నిర్మాత వెంకీ కుడుముల , డైరెక్టర్ మహేష్ , డీఓపీ రాజా పాల్గొన్నారు .