Mahesh Bhagwat: హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్.. ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా బదిలీ అయిన వి.సి. సజ్జనార్..
Mahesh Bhagwat And Sajjanar
Mahesh Bhagwat: తెలంగాణ రాష్ట్ర పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గురువారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ భారీ ప్రక్షాళనలో భాగంగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్‌గా పనిచేస్తున్న వి.సి. సజ్జనార్‌ను అక్కడి నుంచి బదిలీ చేస్తూ.. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ మురళీధర్ భగవత్‌ను కొత్త కమిషనర్‌గా నియమించారు.
బదిలీ అయిన వి.సి. సజ్జనార్‌కు రాష్ట్ర అగ్నిమాపక, విపత్తు స్పందన విభాగం (ఫైర్, డిజాస్టర్ రెస్పాన్స్) డైరెక్టర్ జనరల్ (డీజీ)గా బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా ఆయనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) డీజీగా అదనపు బాధ్యతలను కూడా ప్రభుత్వం కేటాయించింది. ఈ ఉత్తర్వుల ప్రకారం పలు కీలక విభాగాలకు కొత్త అధిపతులు నియమితులయ్యారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) వైస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్‌గా అనిల్ కుమార్ నియమితులు కాగా, జైళ్లశాఖ డీజీగా స్వాతి లక్రా బాధ్యతలు స్వీకరించనున్నారు. అదేవిధంగా మహిళా భద్రతా విభాగం (ఉమెన్ సేఫ్టీ వింగ్) డీజీగా సౌమ్య మిశ్రా, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా నాగిరెడ్డి నియమితులయ్యారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీగా చారు సిన్హాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.