Skip to content
వినోదం › వార్తలు

రజనీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని

Prajapaksham 10 Nov 2026 0 నిమిషాల పఠనం వినోదం
రజనీకాంత్ ‘ధర్మన్’లో రామ్ పోతినేని

Ram Pothineni

రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్ర ‘ధర్మన్’లోకి మరో క్రేజీ హీరో చేరారు. ఈ చిత్రంలో ప్రముఖ తెలుగు హీరో రామ్ పోతినేని నటిస్తున్నారు. డైనమిక్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆకట్టుకునే నటన, ప్రత్యేకమైన ఎనర్జీతో రామ్ పోతినేని తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘దేవదాస్’తో గుర్తుండిపోయే అరంగేట్రం చేసిన ఆయన, ‘రెడీ’, ‘కందిరీగ’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి పలు విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. వరుస విజయాలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. సూపర్‌స్టార్ రజనీకాంత్, రామ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించిన క్షణం ప్రేక్షకులను వెంటనే ఆకట్టుకుంటుంది. విమానంలో ప్రయాణికులకు ముందున్న ప్రయాణంలో టర్బులెన్స్ ఉండబోతోందని ప్రకటన రావడంతో ఈ గ్లింప్స్ ప్రారంభమవుతుంది. ఆ హెచ్చరికతో ఆసక్తి పెరుగుతున్న సమయంలో రజనీకాంత్ ఒక గన్‌ను విసరగా, రామ్ ఎంతో స్టైల్‌గా దాన్ని అందుకుంటారు. ఈ పవర్‌ఫుల్ మూమెంట్ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ ఎలా ఉండబోతోందో చెప్పకనే చెబుతోంది.గడ్డం, కళ్లద్దాలతో సిగరెట్ తాగుతూ మాస్ అవతార్‌లో రామ్ కనిపిస్తున్నారు.
‘ధర్మన్’ చిత్రంతో రామ్ పోతినేని కెరీర్‌లో మరో కీలకమైన మైలురాయిని అందుకోబోతున్నారు. ఈ సినిమాతో ఆయన తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతున్నారు. అంతేకాదు, తొలిసారి లెజెండరీ రజనీకాంత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.
అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ప్రతిష్టాత్మక రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, శ్రీలీల కీలక పాత్రల్లో నటిస్తున్నారు.