Wedding Turns Into Shock: పెళ్లయిన నాలుగు రోజులకే భర్తకు షాక్.. రూ.17.80 లక్షల నగలు, నగదుతో భార్య పరార్..
No Bride After 9 Years: 9 ఏళ్లయినా పెళ్లి కాలేదని మ్యారేజ్ బ్యూరోపై కేసు.. పరిహారం చెల్లించాలని వినియోగదారుల కమిషన్ సంచలన తీర్పు
Wedding Turns Into Shock: పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఆ యువకుడికి వివాహమైన నాలుగు రోజులకే ఊహించని షాక్ తగిలింది. ఇంట్లో కొత్త కోడలిగా అడుగుపెట్టిన భార్య ఉన్నట్టుండి మాయమైంది. ఆమె కోసం ఆరా తీస్తే ఆచూకీ లభించలేదు సరికదా.. ఇంట్లోని సేఫ్ తెరిచి చూస్తే లక్షల విలువైన నగలు, నగదు మాయమైనట్లు వెలుగులోకి వచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలో చోటుచేసుకున్న ఈ కిలాడీ కోడలి ఘాతకం ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
బాధితుల ఫిర్యాదు మేరకు హర్యానాలోని యమునానగర్‌కు చెందిన 22 ఏళ్ల యువతితో బిలాస్పూర్ జిల్లాకు చెందిన ఒక యువకుడికి వివాహం నిశ్చయమైంది. అక్టోబర్ 31న హర్యానాలోని జగాధ్రి సివిల్ కోర్టులో వీరిద్దరూ రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత వధువు భర్తతో కలిసి అత్తింటికి వెళ్లింది. కొత్త కోడలు రావడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. అయితే ఆ ఆనందం నాలుగు రోజులకే ఆవిరైంది. నవంబర్ 4న ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి ఆ వధువు కనిపించకుండా పోయింది.
కుటుంబ సభ్యులు సేఫ్ తెరిచి చూడగా అందులో ఉంచిన సుమారు రూ.16 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.1.80 లక్షల నగదు మాయమైనట్లు గుర్తించారు. మొత్తం రూ.17.80 లక్షల విలువైన సొత్తుతో ఆమె పరారైనట్లు తేలడంతో తొలుత బంధువులు, తెలిసిన ప్రాంతాల్లో గాలించారు. ఎలాంటి సమాచారం లభించకపోవడంతో వరుడి సోదరి భరారీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బాధితుల ఫిర్యాదు మేరకు భరారీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనపై బిలాస్పూర్ ఎస్పీ అభిషేక్ ధిమాన్ స్పందిస్తూ కేసు నమోదు చేసి కనిపించకుండా పోయిన యువతి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామని, ఇది మరేదైనా ముఠా పనియా లేక వ్యక్తిగత మోసమా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని తెలిపారు.