Skip to content
క్రైమ్ › వార్తలు

Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. చావ్రి బజార్‌లో 3 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి, పలువురికి గాయాలు.. వీడియో ఇదిగో..

jagan 05 Nov 2026 1 నిమిషాల పఠనం క్రైమ్
Delhi Building Collapse: ఢిల్లీలో ఘోర ప్రమాదం.. చావ్రి బజార్‌లో 3 అంతస్తుల భవనం కూలి ఇద్దరు మృతి, పలువురికి గాయాలు.. వీడియో ఇదిగో..

Delhi Building Collapse

Delhi Building Collapse: ఓల్డ్ ఢిల్లీలోని అత్యంత రద్దీ ప్రాంతమైన చావ్రి బజార్‌లో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చావ్రి బజార్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఒక పాత కాలం నాటి మూడు అంతస్తుల నివాస భవనం అకస్మాత్తుగా కూలిపోయింది (Building Collapse). ఈ ప్రమాదంలో భవన శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయానికి భవనంలో పలువురు నివాసితులు ఉండటంతో శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.

భవనం కూలిన వెంటనే సమాచారం అందుకున్న ఢిల్లీ అగ్నిమాపక దళం (Delhi Fire Service) ఘటనా స్థలానికి 6 అగ్నిమాపక యంత్రాలు, వాటర్ టెండర్లు , ప్రత్యేక రెస్క్యూ వాహనాలతో చేరుకుంది. పోలీసు ఉన్నతాధికారులు , నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాల పర్యవేక్షణలో సహాయక చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని తక్షణమే చికిత్స నిమిత్తం సమీపంలోని లోక్ నాయక్ జై ప్రకాష్ (LNJP) ఆసుపత్రికి తరలించారు.

ఓల్డ్ ఢిల్లీ కారిడార్‌లో పాత భవనాలు అధికంగా ఉండటం, వరుస ప్రమాదాలు జరుగుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో సెప్టెంబర్ 6న సౌత్ ఢిల్లీలోని సత్య నికేతన్ ప్రాంతంలో 5 అంతస్తుల పీజీ హాస్టల్ భవనం కూలిపోయిన దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు. చావ్రి బజార్ భవనం కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.

ట్యాగ్‌లు: Breaking News Delhi Today news