Skip to content
వినోదం › వార్తలు

‘ధర్మన్‌’లో రజనీకాంత్‌ సరసన శ్రీలీల

Prajapaksham 05 Nov 2026 1 నిమిషాల పఠనం వినోదం
‘ధర్మన్‌’లో రజనీకాంత్‌ సరసన శ్రీలీల

Sri leela

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘ధర్మన్‌’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. హీరోయిన్‌ శ్రీలీలకు స్వాగతం పలుకుతూ, ఆమెను సరికొత్త, ఆకట్టుకునే అవతార్లో పరిచయం చేసే గ్లింప్స్‌ను విడుదల చేశారు. రాక్‌స్టార్‌ అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన క్లాసికల్‌ మ్యూజిక్‌ ఆమె పరిచయ సన్నివేశాలకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్‌ షీ ఈజ్‌ ది స్పార్క్‌ అండ్‌ షీ ఈజ్‌ ది పటాకా ”అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ ఇచ్చారు. దీంతో సినిమాలో శ్రీలీల పోషించబోయే పాత్ర ఎంతో సందడిగా ఉండబోతోందనే సంకేతాలు ఇచ్చారు. రాజ్‌ కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, టర్మరిక్‌ మీడియా బ్యానర్లపై కమల్‌ హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌తో ఈ సినిమా మంచి క్యూరియాసిటీని క్రియేట్‌ చేసింది. ఇందులో రజనీకాంత్‌ ‘ది డెడ్లీ డాక్టర్‌’ అనే మిస్టీరియస్‌ డాక్టర్‌ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తున్నారు. ప్రముఖ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌లో అన్బరివ్‌ యాక్షన్‌ సీక్వెన్స్లను పొందిస్తున్నారు. సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, సరసన నయనతారతో పాటు శ్రీలీల మరో హీరోయిన్‌గా నటిస్తోంది.