ఒక డైలాగ్ ఉంది .. మీ జీవితంలో ఉపయోగపడుతుంది.. ‘సీన్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య
Scene Movie
హీరో సూర్య, మలయాళ బ్లాక్‌బస్టర్ ‘ఆవేశం’ ఫేమ్ దర్శకుడు జిత్తు మాధవన్‌తో కలసి యాక్షన్-కామెడీ ఎంటర్టైనర్ ‘సీన్’ చేస్తున్నారు. నజ్రియా నజీమ్ హీరోయిన్గా నటిస్తుండగా, నస్లేన్, ఆనంద్ రాజ్, లాల్, రాజ్ ప్రియన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జ్యోతిక, సూర్య అగరం స్టూడియోస్, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జయశ్రీ దామోదరన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఎన్వీఆర్ సినిమా ద్వారా గ్రాండ్ రిలీజ్ కానుంది. ‘సీన్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఘనంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో సూర్య మాట్లాడుతూ మేమందరం కలిసి ఒక బ్యూటిఫుల్ సినిమాను అందిస్తున్నాం. ఇందులో మర్డర్ మిస్టరీ, మ్యాడ్నెస్, నవ్వులు అన్నీ ఉన్నాయి. రాకేందు మౌళి తెలుగులో చాలా చక్కని మాటలు, పాటలు రాశారు. చాలా కమిట్మెంట్తో పనిచేశారు. ఈ సినిమాలో చాలా ఫ్రెష్ టాలెంట్ కూడా ఉంది. నజ్రియాతో కలిసి పనిచేయడం చాలా హ్యాపీగా అనిపించింది. తను చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తను స్టంట్స్ కూడా చేసింది. ఇది చాలా స్పెషల్ ఫిల్మ్. ఇందులో ఒక డైలాగ్ ఉంది. అది నిజంగా మీ జీవితంలో కూడా ఉపయోగపడుతుంది. మనపై మనం నమ్మకం ఉంచి ప్రయత్నిస్తే ఏదైనా సాధించవచ్చు. ‘సీన్’ చాలా మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా. కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఈ సినిమాను చూడొచ్చు అని అన్నారు. హీరోయిన్ నజ్రియా నజీమ్, డైరెక్టర్ వెంకీ అట్లూరి, లిరిక్ రైటర్ రాకేందు మౌళి, ప్రొడ్యూసర్ జయశ్రీ దామోదరన్, నిర్మాత ఎన్వీ ప్రసాద్ పాల్గొన్నారు.