AP Municipal Election Results: నెల్లూరులో టీడీపీ జోరు..ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటలో వరుస విజయాలు.. వైసీపీకి ఎదురుదెబ్బ..
AP Municipal Election Results: నెల్లూరులో టీడీపీ జోరు..ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటలో వరుస విజయాలు.. వైసీపీకి ఎదురుదెబ్బ..
Nellore Municipal Election Results: నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ హవా కొనసాగుతోంది. ఆత్మకూరు, వెంకటగిరి, సూళ్లూరుపేటలో విజయాలు సాధించగా.. నెల్లూరు కార్పొరేషన్లో భారీ ఆధిక్యంలో ఉంది.
AP Municipal Election Results: ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయాల దిశగా దూసుకెళ్తున్నారు. ముఖ్యంగా టీడీపీ అభ్యర్థులు సాధిస్తున్న భారీ ఆధిక్యాలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. దీంతో జిల్లాలో వైసీపీకి గట్టి పోటీ ఎదురవుతోంది.
నెల్లూరు నగరపాలక సంస్థలో టీడీపీ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ సుమారు 40 వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు ఆత్మకూరు మున్సిపాలిటీలో టీడీపీ అభ్యర్థి బొమ్మిరెడ్డి షకీలా విజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థిపై 2,206 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
వెంకటగిరి, సూళ్లూరుపేటలో టీడీపీ అభ్యర్థుల విజయం
వెంకటగిరి మున్సిపాలిటీలోనూ టీడీపీ తన సత్తా చాటింది. ఆ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థి దొంతు శారద 10,636 ఓట్లతో విజయం సాధించారు. సూళ్లూరుపేటలో టీడీపీ అభ్యర్థి పిట్ల సుహాసిని 8,306 ఓట్ల మెజారిటీతో గెలిచి చైర్పర్సన్ పీఠాన్ని దక్కించుకున్నారు.
బుచ్చిరెడ్డిపాళెంలో టీడీపీ అభ్యర్థి దొడ్ల విజయలక్ష్మి కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆమెకు ప్రస్తుతం 3,543 ఓట్ల ఆధిక్యం ఉన్నట్లు సమాచారం. ఈ ఫలితాలతో నెల్లూరు జిల్లాలో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.
నాయుడుపేటలో ఉత్కంఠ.. నిలిచిన కౌంటింగ్
నాయుడుపేట మున్సిపాలిటీలో మాత్రం ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక్కడ వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ 1,473 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇంకా సుమారు 1,400 ఓట్లు లెక్కించాల్సి ఉండటంతో తుది ఫలితం ఎలా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది.
కౌంటింగ్ ప్రక్రియలో టీడీపీ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగడంతో ఎన్నికల అధికారులు లెక్కింపును తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతో నాయుడుపేట ఫలితంపై ఉత్కంఠ మరింత పెరిగింది.
మొత్తంగా నెల్లూరు జిల్లాలో పలు మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు విజయాలు సాధించడం, మరికొన్ని చోట్ల ఆధిక్యంలో కొనసాగడం కూటమి శ్రేణుల్లో ఆనందాన్ని నింపింది. మిగిలిన స్థానాల తుది ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి న