Skip to content
ఆంధ్రప్రదేశ్ › వార్తలు

AP DSC 2026: ఏపీలో 2,721 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు..

Krishna Rao 05 Nov 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
AP DSC 2026: ఏపీలో 2,721 టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నవంబర్ 11 నుంచి అప్లికేషన్లు..

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. డీఎస్సీ-2026 నియామక ప్రక్రియకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ యాజమాన్యాల పరిధిలో ఖాళీగా ఉన్న 2,721 పోస్టులను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. నవంబర్ 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. నవంబర్ 30 వరకు అభ్యర్థులు తమ అప్లికేషన్లు సమర్పించవచ్చు. రాత పరీక్షలను డిసెంబర్ 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 13 వరకు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు.

ఏ కేటగిరీలో ఎన్ని ఖాళీలు?

ఈ డీఎస్సీ ద్వారా సాధారణ పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులతో పాటు ప్రత్యేక విద్యా విభాగంలోనూ నియామకాలు చేపట్టనున్నారు. మొత్తం ఖాళీలను మూడు ప్రధాన విభాగాలుగా విభజించారు.

  • జనరల్ స్కూళ్లు: స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ విభాగాల్లో 2,111 పోస్టులు.
  • ప్రత్యేక విద్యా విభాగం: స్కూల్ అసిస్టెంట్, ఎస్‌జీటీ కలిపి 350 ఖాళీలు.
  • సొసైటీలు, ఇతర యాజమాన్యాలు: ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ, ఫిజికల్ డైరెక్టర్, పీఈటీ విభాగాల్లో 260 పోస్టులు.

ఈ మూడు విభాగాల్లో కలిపి 2,721 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గత ఏడాది నిర్వహించిన మెగా డీఎస్సీ ద్వారా 16,342 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో విడత నియామకాలకు ప్రభుత్వం సిద్ధమైంది.

డీఎస్సీ పరీక్షల ముఖ్యమైన తేదీలు ఇవే

అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ ముందుగానే పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. డిసెంబర్ 5న ఆన్‌లైన్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 14 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు జరగనున్నాయి.

చివరి పరీక్ష ముగిసిన రెండు రోజుల అనంతరం ప్రాథమిక సమాధానాల కీని అందుబాటులోకి తీసుకురానున్నారు. దానిపై అభ్యంతరాలు తెలియజేసేందుకు అభ్యర్థులకు వారం రోజుల సమయం ఇవ్వనున్నారు. ఆ తర్వాత మరో వారం వ్యవధిలో తుది కీని విడుదల చేసేలా ప్రక్రియను రూపొందించారు.

రిజర్వేషన్ల వివరాలు కూడా వెబ్‌సైట్‌లో

పోస్టుల వారీగా రిజర్వేషన్ రోస్టర్, హారిజాంటల్ రిజర్వేషన్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. దీనివల్ల అభ్యర్థులు తమకు అర్హత ఉన్న కేటగిరీల్లోని ఖాళీల వివరాలను తెలుసుకోవచ్చు. క్రీడా కోటా కింద దరఖాస్తు చేసుకునే వారికి కూడా రాత పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్షలన్నీ కంప్యూటర్ ఆధారిత విధానంలోనే జరగనున్నాయి.

ప్రైవేట్ పాఠశాలల ఏర్పాటుకు నిబంధనలు సడలింపు

మరోవైపు రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలను ప్రారంభించాలనుకునే యాజమాన్యాలకు ఏపీ ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. పాఠశాలల స్థాపన, గుర్తింపు, నిర్వహణకు సంబంధించిన అనుమతుల ప్రక్రియలో మార్పులు తీసుకొచ్చింది. గతంలో పారిశుద్ధ్య ధ్రువీకరణ పత్రంతో పాటు ట్రాఫిక్, పురపాలక, గ్రామ పంచాయతీల నుంచి సమర్పించాల్సిన నిరభ్యంతర పత్రాల స్థానంలో యాజమాన్యాలు స్వయంగా ధ్రువీకరణ ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టింది.

అయితే భవన నిర్మాణ భద్రత, ఆ భవనాన్ని పాఠశాల అవసరాలకు వినియోగించేందుకు అనుమతి, అగ్నిమాపక భద్రతకు సంబం

ట్యాగ్‌లు: andhra pradesh