‘కుకూన్స్” పోస్టర్ లాంచ్
‘Cocoons’ Poster Launch
జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కుకూన్స్’. ఈ చిత్రాన్ని న్యూ వేవ్ పిక్చర్స్, ఎం.ఆరట్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సుఖేష్ పొట్ల, మమత రెడ్డి కాసం, మహేశ్ గౌరి నిర్మిస్తున్నారు. డైరెక్టర్ మహేశ్ గౌరి దర్శకత్వం వహిస్తున్నారు . యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చే మంచి ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ రోజు ‘కుకూన్స్” చిత్ర పోస్టర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రిలీజ్ చేశారు. అనంతరం డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘కుకూన్స్” సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. ఈ పోస్టర్ కొత్తగా ఉండి ఆకట్టుకుంది. డైరెక్టర్ మహేశ్ గౌరి సరికొత్త ఆలోచనలు ఈ పోస్టర్లో తెలుస్తున్నాయి. టైటిల్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ రోల్ చేసిన వికాస్ గతంలో డ్రామా జూనియర్స్ ప్రోగ్రాంకు మెంటార్‌గా పనిచేశారు. ఇప్పుడీ చిత్రంతో నటుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జగన్, సాగర్, వికాస్ తో పాటు మిగతా ‘కుకూన్స్” టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నా. అన్నారు. జగన్ జోగిరాజ్, సాగర్ కిరణ్, వికాస్ చైతన్య, సంగన డుగ్గు, సురభి దీప్తి, దీప్తి పద్మనిమ్మనగోటి, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ – శ్రీశైలం, ఎడిటర్ – ఆదిత్య తివారి డిఒపి – నిఖిల్ శ్యామ్, మ్యూజిక్ డైరెక్టర్ – బి.ఎన్.ఆదిత్య, స్క్రిప్ట్, డైరెక్షన్ మహేశ్ గౌరిపీఆర్ఒ గాండ్ల శ్రీనివాస్ (జి.ఎస్.మీడియా).
- Pakistan Cosmetics: పాకిస్థాన్ నుంచి అక్రమ దిగుమతులు. రూ.7 లక్షల కాస్మోటిక్స్ సీజ్
- CJP Protest: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్.. సీజేపీ నిరసనతో ముంబై శివాజీ పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. నటుడు నసీరుద్దీన్ షా హాజరు..
- Karnataka SIR Row: కర్ణాటకలో ‘ఫారం-7’ వివాదం.. ఓటర్ల తొలగింపుపై ఈసీ కార్యాలయం వద్ద సీఎం డీకే శివకుమార్ ధర్నా..
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళన, పలువురు నేతలు అరెస్ట్..
- Auto Fare Hike in Telangana: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస ఛార్జీ రూ. 30గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ