‘ భోగి’ టీజర్ రిలీజ్
Bhogi Movie Teaser
చార్మింగ్ స్టార్ శర్వా డిఫరెంట్ ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. లక్ష్మీ రాధామోహన్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మిగిలిన షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను ప్రారంభిస్తూ సినిమా టీజర్‌ను విడుదల చేశారు.గ్రామీణ జానపద శైలిలో సాగే వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమవుతుంది. బొగ్గుల గుట్ట అనే గ్రామాన్ని పరిచయం చేస్తూ.. పాలేగాళ్ళు కమ్మరి గంగను తీసుకెళ్లారని అనుపమ పరమేశ్వరన్ పాత్ర చెబుతుంది. అతనికి ఏమైనా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తుంది. గ్రామాన్ని కాపాడేందుకు ఓ ప్రత్యేకమైన భక్తి కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని టీజర్ ద్వారా ప్రజెంట్ చేశారు. ఆ తర్వాత గంగగా శర్వా రఫ్ అండ్ రగ్డ్ లుక్‌లో పవర్‌ఫుల్‌గా ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంది. మట్టితో మమేకమైన ఓ సాధారణ కూలీగా కనిపించే ఆయన.. ఇక తాను మౌనంగా ఉండబోనని హెచ్చరిస్తారు. తన కత్తితో తొమ్మిది మెట్లను కడిగి, శత్రువుల రక్తంతో వాటిని అలంకరిస్తానని గంగ చెప్పే మాటలు పాత్రలోని ఇంటెన్స్సిటీని చూపిస్తాయి.1960ల ప్రారంభంలో తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులోని ఓ కల్పిత గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. సంపత్ నంది ఈ కథను ఎంతో సహజంగా, నేటివిటీతో తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతుంది. పీరియడ్ నేపథ్యాన్ని సహజంగా చూపిస్తూ.. హై వోల్టేజ్ యాక్షన్, పల్లెటూరి డ్రామాను బ్యాలెన్స్ చేసిన విధానం ఆకట్టుకుంటోంది.మిగిలిన షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన తర్వాత సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు. టీజర్ ‘భోగి’పై బలమైన క్యూరియాసిటీని క్రియేట్ చేయడంతో పాటు ఈ ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామాపై అంచనాలను మరింత పెంచింది. శర్వానంద్ , అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి నటిస్తున్నారు.
- Ames Meteorite Crater: ఉల్క దాడి 10 కోట్ల ఏళ్లు ఆలస్యంగా జరిగిందా.. Ames క్రేటర్‌పై శాస్త్రవేత్తల కొత్త అంచనా.. ఓక్లహామా ఉల్కాబిలంపై సంచలన పరిశోధన
- Bathukamma Secret: బతుకమ్మ పండుగలో దాగి ఉన్న అసలు సీక్రెట్ ఇదే.. పూల పండుగ వెనుక ఇంత పెద్ద కథ ఉందా?
- Boddemma Festival: బతుకమ్మకు ముందు వచ్చే బొడ్డెమ్మ పండుగ ప్రత్యేకత ఏంటి.. 7 రోజుల పాటు ఎందుకు జరుపుకుంటారు..
- CEC Gyanesh Kumar Row: CEC జ్ఞానేశ్ కుమార్‌ను సస్పెండ్ చేయాలన్న పిటిషన్లపై విచారణ.. కేంద్రం, ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు..
- Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో భారత ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి.. ఒకరు మృతి, రూ.400 కోట్లకు పైగా నష్టం..