ఆహాలో “నా వైఫ్ మిస్సింగ్”
Na Wife Missing
ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ తో సబ్ స్క్రైబర్స్ ను ఎంగేజ్ చేస్తోన్న ఆహా ఓటీటీ ఇప్పుడు మరో ఎగ్జైటింగ్ సిరీస్ ను మన ముందుకు తీసుకొస్తోంది. వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రధాన పాత్రల్లో ఆహా ఒరిజినల్ “నా వైఫ్ మిస్సింగ్” త్వరలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. ఈ సిరీస్ తెలుగుతో పాటు తమిళంలోనూ సబ్ స్క్రైబర్స్ కు అందుబాటులో ఉండనుంది.ప్రతి కేసుకు ఒక కథ ఉంటుంది, ఈ కేస్ లో నిజం ఏంటి అనే క్యాప్షన్ తో “నా వైఫ్ మిస్సింగ్” అప్డేట్ ఇచ్చింది ఆహా. తన భార్య మిస్సయ్యిందంటూ వరుణ్ సందేశ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడాన్ని గతంలో రివీల్ చేసింది ఆహా. ఇప్పుడా కేసులో ఉన్న నిజం ఏంటో సిరీస్ లో చూడాలనే క్యూరియాసిటీ ఆడియెన్స్ లో క్రియేట్ అవుతోంది. త్వరలో “నా వైఫ్ మిస్సింగ్” స్ట్రీమింగ్ డేట్ ను ఆహా ఓటీటీ అనౌన్స్ చేయబోతోంది. కొత్త బంగారులోకం వంటి సూపర్ హిట్ సినిమా చేసిన పెయిర్ వరుణ్ సందేశ్, శ్వేతాబసు ప్రసాద్ లాంగ్ గ్యాప్ తర్వాత చేస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం.
- Prakash Raj SIR Remarks: పవన్ కల్యాణ్‌కు ప్రకాశ్ రాజ్ సూటి ప్రశ్న.. ‘ప్రజల పక్షాన ఉంటారా? ఎన్నికల సంఘం పక్షాన ఉంటారా?’
- Dussehra 2026: నవరాత్రుల్లో అమ్మవారి 9 అవతారాలు ఇవే.. శైలపుత్రి నుంచి సిద్ధిదాత్రి వరకు ఒక్కో రూపం విశిష్టత గురించి తెలుసా..
- Andhra Pradesh Elections: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అర్ధరాత్రి 17.20 లక్షల ఓట్లు ఎలా పోలయ్యాయి? పరకాల ప్రభాకర్ సంచలన విశ్లేషణ..పూర్తి వివరాలు ఇవే..
- Rahul Gandhi Satyagraha: దేశవ్యాప్త ఉద్యమాలకు డిజిటల్ వేదిక.. ‘సత్యాగ్రహ’ పోర్టల్ ప్రారంభించిన రాహుల్ గాంధీ
- Telangana Express Turns 50: తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌కు 50 ఏళ్లు.. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ నుంచి తెలంగాణ ఎక్స్‌ప్రెస్ దాకా .. ఐదు దశాబ్దాల ప్రస్థానం..