Skip to content
వినోదం › వార్తలు

నెట్ ఫ్లిక్స్ లో “రోమాంచకం” స్ట్రీమింగ్

Prajapaksham 03 Oct 2026 0 నిమిషాల పఠనం వినోదం
నెట్ ఫ్లిక్స్ లో “రోమాంచకం” స్ట్రీమింగ్

romanchakam

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మించిన సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందించారు. థియేట్రికల్ గా “రోమాంచకం” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణ పొంది ఘన విజయం సాధించింది. ఈ చిత్రంలోని ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఎలిమెంట్స్ ను మాస్, క్లాస్ ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లోనూ “రోమాంచకం” సందడి మొదలైంది. “రోమాంచకం” మూవీ నెట్ ఫ్లిక్స్ లోకి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో ఈ సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. థియేట్రికల్ గా “రోమాంచకం” మిస్ అయిన ఆడియెన్స్ నెట్ ఫ్లిక్స్ లో మూవీని ఎంజాయ్ చేయొచ్చు. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ సినిమా మరింతమంది ప్రేక్షకులకు చేరువకాబోతోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్, ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి, మణి, సోహన్, తదితరులు నటించారు.