‘ఆత్మకథ‘ ఆడియో ఆవిష్కరణ
Aathma Katha
వారాహి ఎంటర్టైనమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సోమేష్ నిర్మాతగా శ్రీనివాస్ బండ్రెడ్డి రచనా దర్శకత్వంలో రానున్న చిత్రం ఆత్మ కథ – యాన్ అన్ టోల్ స్టోరీ. జెమిని సురేష్ హీరోగా రూప హీరోయిన్గా చేయగా సమ్మెట గాంధీ, షకలక శంకర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, నాగ మహేష్, బలగం విజయలక్ష్మి, శ్రీనివాస్ నాయుడు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి తదితరులు కీలకపాత్రలు పోషించారు. శ్రేయాంశ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రానికి గోపి డిఒపిగా చేయగా రాఘవేంద్ర రెడ్డి ఎడిటింగ్ చేశారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి గారు, రిథమ్ స్టూడియో ఇన్చార్జి కొల్లి రామకృష్ణ గారు, అలాగే కూనపరెడ్డి అవినాష్ గారి చేతుల మీదగా హనుమాన్ మ్యూజిక్ లాంచ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ మ్యూజిక్ లేబుల్ లో మొదటిగా ఆత్మకథ చిత్ర పాటలు ఉండేలా ఆత్మకథ ఆడియోను ప్రముఖ సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్, రఘు కుంచె చేతుల మీదగా విడుదల చేశారు. ఈ సినిమా కథ నాకు దర్శకులు చెప్పినప్పుడు నాకు చాలా సర్ర్పైజ్గా అనిపించింది. సురేష్ నటిస్తున్న ఆత్మ కథ చిత్ర సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను.హీరోయిన్ రూప మాట్లాడుతూ… ‘మా సినిమా ఒక చిన్న కథ. నాకు మొదటిసారి అవకాశం ఇచ్చిన నడుచకుడు శ్రీనివాస్ గారికి థాంక్స్. ఈ సినిమాను అందరూ ఆదరించాల్సిందిగా కోరుకుంటున్నాను. హీరో జెమిని సురేష్ మాట్లాడుతూ… ‘సినిమాలకు ఆడియో లాంచ్ కార్యక్రమాలు జరిగి చాలా రోజులు అయింది. ఇప్పుడు హనుమ మ్యూజిక్ ద్వారా నేను నటించిన ఆత్మకథ సినిమాతో మరోసారి ప్రారంభం కావడం చాలా సంతోషం అనిపించిందని అన్నారు.
- Pakistan Cosmetics: పాకిస్థాన్ నుంచి అక్రమ దిగుమతులు. రూ.7 లక్షల కాస్మోటిక్స్ సీజ్
- CJP Protest: సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్.. సీజేపీ నిరసనతో ముంబై శివాజీ పార్కు వద్ద తీవ్ర ఉద్రిక్తత.. నటుడు నసీరుద్దీన్ షా హాజరు..
- Karnataka SIR Row: కర్ణాటకలో ‘ఫారం-7’ వివాదం.. ఓటర్ల తొలగింపుపై ఈసీ కార్యాలయం వద్ద సీఎం డీకే శివకుమార్ ధర్నా..
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ ప్రతిపక్షాలు ఆందోళన, పలువురు నేతలు అరెస్ట్..
- Auto Fare Hike in Telangana: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కనీస ఛార్జీ రూ. 30గా ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ