Vijay Divorce Case Ends: విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు.. పిటిషన్‌ను వెనక్కి తీసుకున్న సంగీత..కేసును కొట్టివేసిన కోర్టు
Vijay Divorce Case Ends
తమిళనాడు ముఖ్యమంత్రి C. Joseph Vijay కుటుంబ వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. ఆయన భార్య Sangeetha Sornalingam చెంగల్పట్టు కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరైన ఆమె, కేసును కొనసాగించబోనని తెలియజేయడంతో కోర్టు పిటిషన్‌ను ఉపసంహరించబడినదిగా నమోదు చేసి కేసును ముగించింది
Vijay Divorce Case Ends: తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రి విజయ్ (జోసెఫ్ విజయ్) కుటుంబ వివాదానికి సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. సీఎం విజయ్ సతీమణి సంగీత.. చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానంలో గతంలో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను అధికారికంగా ఉపసంహరించుకున్నారు.
సంగీత తన విడాకుల పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు న్యాయస్థానానికి విన్నవించడంతో.. ఇరువర్గాల వాదనలను పరిశీలించిన చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కేసుకు సంబంధించి తుది ఉత్తర్వులు వెలువరించింది. పిటిషన్ ఉపసంహరణను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ విడాకుల కేసుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను పూర్తిగా ముగిస్తున్నట్లు (Disposed of) ప్రకటించింది.
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి గత కొంతకాలంగా రకరకాల ఊహాగానాలు, ప్రచారాలు సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే, సంగీత స్వయంగా కోర్టులో పిటిషన్‌ను ఉపసంహరించుకోవడంతో ఈ హైప్రొఫైల్ కుటుంబ వివాదానికి ముగింపు లభించినట్లయింది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.
- Jurala Project: జూరాల వద్ద ఉద్రిక్తత.. సాగునీటి కోసం రైతుల ఆందోళన, BRS నేత చిట్టెం రామ్మోహన్ రెడ్డి అరెస్ట్ (Video)
- Jagadish Reddy Farmhouse: జగదీష్ రెడ్డి ఫామ్‌హౌస్ వద్ద కాంగ్రెస్ నేతల పరిశీలన.. భూములపై సంచలన ఆరోపణలు
- Nani The Paradise: ది ప్యారడైజ్‌కు ఏపీలో టికెట్ రేట్ల పెంపు.. ప్రీమియర్ షోలకు కూడా అనుమతి
- AP Junior Doctors Stipend Hike: ఏపీ జూనియర్ డాక్టర్లకు గుడ్‌న్యూస్.. స్టైపెండ్ పెంపు, జనవరి 1 నుంచే అమలు
- Varupula Subbarao Joins Jana Sena: వైసీపీకి వరుపుల సుబ్బారావు గుడ్‌బై.. పవన్ సమక్షంలో జనసేనలో చేరిక