Skip to content
లైఫ్ స్టైల్ › వార్తలు

మానవాళికి శాపంగా యుద్ధ సంక్షోభాలు!

Prajapaksham 06 Nov 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
మానవాళికి శాపంగా యుద్ధ సంక్షోభాలు!

Global Warming

డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌ రెడ్డి

(06 నవంబర్‌ యుద్ధం, సాయుధ సంక్షోభాల్లో పర్వావరణ విధ్వంసాలను నివారించే అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా)
యుద్ధాలు, సాయుధ సంఘర్షణలు అంటే మారణహోమమే. గాయపడిన సైనికులు, పౌర సమాజ అభాగ్యుల హాహాకారాలే. యుద్ధాల్లో ఆస్తుల ధ్వంసం, మౌళిక వసతుల వినాశనం తప్పనిసరి అని మనకు తెలుసు. యుద్ధా లు లేదా సాయుధ సంఘర్షణలు జరిగినపుడు ప్రపంచ మానవాళికి తెసిసేది మరణించిన వారి సంఖ్య, గాయపడిన ఆసుపత్రుల పాలైన ధ్వనుల వివరాలు, కూలిన భవనాలు, దెబ్బతిన్న మౌళిక వసతులు మాత్రమే ప్రచారంలోకి వస్తాయి. నగరాలు నేలమట్టం అవుతాయి. ఈ అపార నష్టాలతో పాటు యుద్ధాల వల్ల పర్యావరణానికి అపార నష్టాలు జరగడం కొనసాగుతున్నాయి. చమురు పరిశ్రమలు దెబ్బతింటాయి. కలప, వజ్రాలు, బంగారం, విలువైన ఖనిజాల సంబంధ కార్యకలాపాలు దెబ్బతింటాయి.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.5 బిలియన్లు, అనగా 20 శాతం జనాభా సంఘర్షణల విష వలయంలో చిక్కి విలవిల్లాడుతున్నారు. గత ఆరు దశాబ్దాల్లో జరిగిన 40 శాతం సంఘర్షణల్లో పర్యావరణం అపార నష్టాలను మూటకట్టుకొని, రేపటి తరం ఆరోగ్యకర జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్న విషయాలను గుర్తించిన ఐరాస జనరల్‌ అసెంబ్లీ 2001లో తీసుకున్న తీర్మానం ప్రకారం ప్రతి ఏట 06 నవంబర్‌ రోజున యుద్ధాలు, సాయుధ సంఘర్షణల్లో పర్యావరణ దోపిడీని నివారించే అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్‌ డే ఫర్‌ ప్రివెంటింగ్‌ ది ఎక్స్‌ప్లాయిటేషన్‌ ఆఫ్‌ ది ఎన్విరాన్‌మెంట్‌ ఇన్‌ వార్‌ అండ్‌ ఆర్ముడ్‌ కాన్‌ప్లిక్ట్‌) పాటించడం ఆనవాయితీ గా మారింది. యుద్ధాల సమయంలో పర్యావరణ వ్యవస్థల సహజత్వాలను కాపాడడం, సహజ వనరుల సుస్థిర నియంత్రణ చేయడం, శాంతి స్థాపన చర్యలు తీసుకోవడం, పర్యావరణ ఆరోగ్య సంరక్షణకు నిధులు కేటాయించడం లాంటి అంశాలను ప్రచారం చేయడం జరుగుతున్నది. ఈ మహత్తర బాధ్యతలను పౌర సమాజం, ప్రభుత్వాలు, సంస్థలు చేతులు కలిపి పర్యావరణ విధ్వంసం జరుగకుండా అడ్డుకోవాలి. ప్రస్తుతం సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న రష్యా-/ఉక్రెయిన్‌, ఇజ్రాయిల్‌-/గాజా, అమెరికా/ఇజ్రాయిల్‌-ఇరాన్‌ యుద్ధాలు ప్రపంచ మానవాళిని, పర్యావరణాన్ని అతలాకుతలం చేయ డం చూస్తున్నాం.యుద్ధాలు జరిగినపుడు బాంబుల మోతలు మోగుతాయి. భూమాత సహజత్వం కలుషితం అవుతుంది. రసాయన, హెవీ మెటల్‌ ప్రమాదాలు మీద పడతాయి. అడవుల విధ్వంసం జరుగుతుంది. యుద్ధాలతో దీర్ఘకాలిక సమస్యలు మానవాళిని తరుముతాయి. యుద్ధానంతరం కాలు ష్య నివారణ అత్యంత ఖరీదు అవుతుంది. జీవ వైవిధ్యం దెబ్బ తింటుంది. ప్రజారోగ్యం మంటగలుస్తుంది.