ఆగని దీక్ష…జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష ప్రారంభించిన కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ (Video)
ఆగని దీక్ష...జంతర్ మంతర్ వద్ద ఆమరణ దీక్ష ప్రారంభించిన కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ (Video)
ప్రముఖ విద్యావేత్త, సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ గత 21 రోజులుగా కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను ఢిల్లీ పోలీసులు నేడు భగ్నం చేశారు. నీట్ ప్రవేశ పరీక్ష లీకేజీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రారంభమైన ఈ ఆందోళన కొనసాగుతుందని, జూలై 20వ తేదీన పార్లమెంటు ముట్టడి నిర్వహిస్తామని కాక్రోచ్ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ పేర్కొన్నారు. అంతేకాదు అభిజీత్ దీప్కేతో సహా సీజేపీ నిరసనకారులు జంతర్ మంతర్ వద్ద ఇంకా ధర్నా కొనసాగిస్తున్నారు. అలాగే మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పరిస్థితిని అదుపులో ఉంచేందుకు ఢిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఆ ప్రాంతంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు బారికేడ్లు ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. ప్రస్తుతానికి నిరసనకారులను తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. పరిస్థితిని సమీక్షించిన తర్వాత తదుపరి చర్యపై నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలిపారు.
శాంతిభద్రతలను కాపాడటం, ఉద్యమంలో పాల్గొన్న ప్రముఖుల, ముఖ్యంగా సోనమ్ వాంగ్‌చుక్ మద్దతుదారులు నిరసనకారుల భద్రతను నిర్ధారించడమే ప్రభుత్వ యంత్రాంగం ప్రాధాన్యతగా ఉందని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అభిజీత్ దీప్కే మాట్లాడుతూ.. నేను ఈ రోజు నుండి నా నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభిస్తున్నాను. ప్రతిఒక్కరికీ నా విజ్ఞప్తి: వెనకడుగు వేయవద్దు; ఈ ఉద్యమం మరింత విస్తరిస్తుంది. వారు ఘోరమైన తప్పు చేశారు… ప్రతిఒక్కరూ జంతర్ మంతర్‌కు రావాలని నేను కోరుతున్నాను; మన ఉద్యమం ఇక్కడి నుండి కొనసాగుతుంది, జూలై 20న జరగాల్సిన పార్లమెంటు వరకూ పాదయాత్రను కొనసాగిస్తాము.” అని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే సోనమ్ వాంగ్చుక్ను అవసరమైన చికిత్స కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. 21 రోజుల ఉపవాసం కారణంగా బాడీలో డీ హైడ్రోషన్ కారణంగా సోనం బలహీనపడ్డారని. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ, అతని శరీర పారామితులను సాధారణ స్థితికి తీసుకురావడానికి నిరంతర పర్యవేక్షణ చికిత్స అవసరమని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.