Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

హైదరాబాద్‌ను చూస్తే నాకు అసూయ వేస్తుంది – మంత్రి లోకేష్ (Video)

Prajapaksham 17 Jul 2026 1 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్‌ను చూస్తే నాకు అసూయ వేస్తుంది – మంత్రి లోకేష్ (Video)

మంత్రి లోకేష్ తాజాగా హైదరాబాద్ పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా తనకు హైదరాబాద్ నగరం అలాగే ప్రస్తుత అభివృద్ధిని గమనిస్తే అసూయ వేస్తోందని చెప్పుకొచ్చారు. అంతేకాదు 60 సంవత్సరాల పాటు చెమటోడ్చి కలసికట్టుగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని, రాష్ట్ర విభజన తర్వాత 2014లో కట్టుబట్టలతో బయటకు పంపించారని, అందుకే ఇప్పుడు కసితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు

ఏపీ మంత్రి లోకేష్ అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.12.56 కోట్ల వ్యయంతో ఆధునీకరించిన మంగళగిరి రైల్వేస్టేషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ గారు వర్చువల్ గా ప్రారంభించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారితో కలిసి ఈ కార్యక్రమంలో శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ప్రసంగిస్తూ ఈయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ అభివృద్ధిలో రైల్వేలది కీలకపాత్ర. రైల్వే స్టేషన్ల ద్వారా ఆర్థికాభివృద్ధి జరగాలి. దక్షిణ భారతదేశంలో నెం.1 రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతాం. మంగళగిరికి పరిశ్రమలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. అలాగే మంగళగిరి నియోజకవర్గ ప్రజలు నా గౌరవాన్ని నిలబెట్టారు. ఇప్పుడు మీ ఆశలు, ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత నాపై మరింత పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు: Nara Lokesh TDP