Sada Bainama: సాదా బైనామా అంటే ఏమిటి? రిజిస్ట్రేషన్ బైనామాకు సాదా బైనామాకు తేడా ఏంటి?
సాదా బైనామా అంటే ఏమిటి? రిజిస్ట్రేషన్ బైనామాకు సాదా బైనామాకు తేడా ఏంటి?
సాధారణంగా భూముల కొనుగోలు అమ్మకాల విషయంలో రికార్డుల పరిశీలన అనేది జరుగుతుంది. . అయితే తెలంగాణలో ఎక్కువగా సాదా బైనామా, ఈ రిజిస్ట్రేషన్ బైనామా అని ల్యాండ్ డాక్యుమెంట్స్ పిలుస్తూ ఉంటారు. అయితే ఇందులో సాదా బైనామా అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సాదా బైనామా: సాదా బైనామా అంటే పది రూపాయలు 50 రూపాయలు వంద రూపాయల విలువ కలిగిన సాధారణ స్టాంపు పేపర్స్ పైన అంటే తెల్ల కాగితంపై అని అర్థం ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదుర్చుకొని రాసుకునే భూ అమ్మక పత్రం, దీన్నే సాదా బైనామా అని కూడా అంటారు. అయితే దీనికి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఎలాంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరగదు.
రిజిస్ట్రేషన్ బైనామా: ఇక రిజిస్ట్రేషన్ బైనామా అంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్దేశిత స్టాంపు డ్యూటీని రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి సబ్ రిజిస్టర్ సమక్షంలో సాక్షుల సంతకం మధ్య భూ బదలాయింపు జరిగే అధికారిక ధ్రువీకరణ మార్పిడిని రిజిస్ట్రేషన్ బైనామా అని పిలుస్తారు. ఇందులో రిజిస్ట్రేషన్ పైనా మాకు పూర్తిస్థాయిలో చట్టబద్ధత లభిస్తుంది కోర్టులో కూడా బలమైన సాక్షంగా రిజిస్ట్రేషన్ బై నామాన్ని చూపించవచ్చు. భారత రిజిస్ట్రేషన్ చట్టం 198 ప్రకారం 100 రూపాయల కన్నా ఎక్కువ విలువైన స్థిరాస్తులను బదలాయింపు చేసినట్లయితే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ బైనామాలో కొనుగోలుదారుడికి పూర్తి హక్కులు లభిస్తాయి.
ఇక సాదా బైనామా విషయానికి వస్తే ఇది పూర్తిగా ఒకరకంగా చెప్పాలంటే తెల్లకాగితం పైన రాసుకున్న పెద్దమనుషుల ఒప్పందం అని చెప్పుకోవచ్చు. దీనికి ఎలాంటి చట్టబద్ధత ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో గతంలో సాదా బైనామాలపైన పెద్ద ఎత్తున భూముల కొనుగోలు అనేవి జరిగాయి. సాదా బై నామాలకు ఎలాంటి చట్టబద్ధత లేని కారణంగా ఒకవేళ అమ్మిన వ్యక్తి కనుక చనిపోతే వారి వారసులు వచ్చి మళ్లీ భూమి పైన హక్కులు కోరే అవకాశం ఉంటుంది. ఇందులో మోసాలు ఎక్కువగా జరిగే ప్రమాదం ఉంది.
ఇక రిజిస్ట్రేషన్ బై నామ విషయానికి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ బై నామా ఆధారంగానే భూభారతి లేదా రెవెన్యూ రికార్డుల్లో మ్యుటేషన్ లేదా పేరు మార్పిడి అనేది ఇలాంటి అడ్డంకులు లేకుండా జరుగుతుంది. అదే సాదా బైనామాను ఉపయోగించి మీరు పట్టాదారు పాసు బుక్కులో పేరు ఎక్కించడం అనేది చాలా కష్టతరమైన పని.
సాదా బైనామాల క్రమబద్ధీకరణ:
సాదా బైనామాలు అనేది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఫారం 13 బి ద్వారా క్రమబద్ధీకరణ చేస్తోంది. దీనివల్ల చట్టబద్ధమైనటువంటి గుర్తింపు లభిస్తుంది.
రిజిస్ట్రేషన్ బై నామాలను ఉపయోగించి బ్యాంకులలో రుణాలను కూడా పొందవచ్చు. అంతేకాదు రిజిస్ట్రేషన్ బైనామా ద్వారా మీరు భవిష్యత్తులో ఆస్తిని చట్టబద్ధంగా వేరొకరికి అమ్మవచ్చు. రిజిస్ట్రేషన్ బైనామా అనేది ప్రభుత్వం నిర్దేశించిన భూమి మార్కెట్ విలువ ఆధారంగా స్టాంపు డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ డ్యూటీలను చెల్లించి రిజిస్ట్రేషన్ బై నామ పొందాల్సి ఉంటుంది.