Mexico Earthquake: వీడియోలు ఇవిగో.. మెక్సికో తీరంలో భారీ భూకంపం.. 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు.. సునామీ హెచ్చరికలు జారీ
Mexico Earthquake: వీడియోలు ఇవిగో.. మెక్సికో తీరంలో భారీ భూకంపం.. 7.3 తీవ్రతతో భూ ప్రకంపనలు.. సునామీ హెచ్చరికలు జారీ
Mexico Earthquake: మెక్సికోలోని దక్షిణ రాష్ట్రమైన చియాపాస్ తీరంలో శుక్రవారం రెక్టర్ స్కేలుపై 7.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం భూగర్భంలో 15.2 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. దీని ప్రభావం పొరుగు దేశాలపై కూడా తీవ్రంగా పడింది. గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్లలోని పలు నగరాల్లో భవనాలు బలంగా కంపించడంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన తక్షణ వివరాలేవీ ఇంకా నమోదు కాలేదు.
ఈ భారీ భూకంపం నేపథ్యంలో అధికారులు అత్యంత అప్రమత్తమయ్యారు. మెక్సికో, గ్వాటెమాలా తీరప్రాంతాల్లో ప్రమాదకరమైన సునామీ అలలు ఎగసిపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు, విపత్తు నిర్వహణ సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.
తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, సముద్ర తీరానికి దూరంగా ఉండాలని స్థానిక ప్రభుత్వాలు ఆదేశించాయి. అధికారులు ప్రస్తుతం నష్ట తీవ్రతను అంచనా వేసే పనిలో ఉన్నారు.