Skip to content
లైఫ్ స్టైల్ వార్తలు

అసమానతలపై పిడికిలి బిగించాల్సిందే..

Prajapaksham 18 Jul 2026 1 నిమిషాల పఠనం లైఫ్ స్టైల్
అసమానతలపై పిడికిలి బిగించాల్సిందే..

(18 జులై అంతర్జాతీయ నెల్సన్‌ మండేలా దినోత్సవం సందర్భంగా)

దక్షిణ ఆఫ్రికా జాతి వివక్ష వ్యతిరేక పోరాటయోధుడు, న్యాయవాది, ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(ఎఎన్‌సి) నాయకుడు, దానశీలి, ప్రజా సేవకుడు, ప్రజా స్వామ్యయుతంగా ఏర్పడిన దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వంలో తొలి నల్లజాతి దేశా ధ్యక్షుడు(1994 27ఏండ్లపాటు జైలు జీవితం అనుభవించిన అవిశ్రాంత నల్లజాతి ప్రతినిధి అయిన నెల్సన్‌ మండేలా పుట్టిన రోజు (18, జులై 1918) సందర్భంగా ఐరాస చొరవతో ప్రతి ఏట 18 జులై రోజున అంతర్జాతీయ నెల్సన్‌ మండేలా దినం లేదా ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ నెల్సన్‌ మండేలాను పాటించడం 18 జూలై 2010 నుంచి ప్రారంభం అయ్యింది. దక్షిణ ఆఫ్రికాలోని మ్వోజో గ్రామంలోని తెంబూ రాయల్‌ కుటుంబంలో జన్మించిన మండేలా వంశంలో తొలి విద్యావేత్తగా పోర్ట్‌హేర్‌, విట్‌వాటర్స్రాడ్‌ యూనివర్సిటీల్లో బిఏ, న్యాయ పట్టాలు పొంది ఉన్నత విద్యావేత్తగా పేరు తెచ్చుకొని, లాయర్‌లా పని చేశారు. పాఠశాల ఉపాధ్యాయుడు తన పేరు ముందు నెల్సన్‌ను చేర్చడంతో నెల్సన్‌ మండేలా అనే పేరు ఖ్యాతిలోకి వచ్చింది. అంతర్జాతీయ నెల్సన్‌ మండేలా దినోత్సవం- ఇతివృత్తంగా పేదరికం, అసమానతల నిర్మూలన ఇప్పటికీ మన చేతుల్లోనే ఉన్నది అనే అంశాన్ని ఎంపిక చేశారు.


ఉద్యమాలే ఊపిరిగా సాగిన జీవితం: 1943లో వర్ణవివక్ష వ్యతిరేక పోరాటా లు ప్రారంభించిన మండేలా ఏఎన్‌సి పార్టీలో చేరి శ్వేతజాతి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటాలు ప్రారంభిం చారు. వర్ణ వివక్ష పోరాటంలో చురుకుగా పాల్గొనడంతో అరెస్టు కూడా అయ్యారు. ఇదే క్రమంలో మార్క్సిజం వైపు ఆకర్షితులై దక్షిణ ఆఫ్రికా కమ్యూనిస్టు పార్టీలో చేరి రహస్యంగా ఉద్యమాలు చేశారు. శాంతియుతంగా పోరాటం చేస్తూ ఉమ్కోంటో వీ స్విజ్వే అనే తీవ్రవాద సంస్థను స్థాపించారు. నాటి శ్వేతజాతి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తూ, 12 జూన్‌ 1963రోజున యావజ్జీవ కారాగార శిక్షను విధించడంతో 27 ఏండ్ల పాటు సుదీర్ఘ జైలు జీవితం అనుభవిస్తూ అంతర్జాతీయ మానవాళి దృష్టిని ఆకర్షిం చారు. జాతీయ, అంతర్జాతీయ ఒత్తిడులకు లొంగిన నాటి ప్రభుత్వం 11, ఫిబ్రవరి 1990న విడుదల చేసింది. జైలులో 466 గదిలో బంధించబడి 63 (1963)లో విడుదల కావడంతో 46663ని మండేలా సంఖ్యగా పిలుస్తారు.


1994లో నిర్వహించిన ఎన్నికల్లో ఏఎన్‌సి పార్టీ నేతృత్వంలో ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో నల్లజాతికి చెందిన తొలి అధ్యక్షుడిగా సేవలు అందించారు.


ఏ లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడం – మండేలా జీవితం:

అంతర్జాతీయ నెల్సన్‌ మండేలా దినోత్సవం సందర్భంగా పేదరిక నిర్మూలన కేంద్రంగా అన్నదాన కార్యక్రమా లు, వృద్ధుల పట్ల ఆదరణ, యువతకు ప్రేరణాత్మక కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవలు, పరిసరాల పరిశుభ్రత లాంటి కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అందరికీ అందుబాటులో విద్య లాంటి కనీస అంశాలకు అంకితభావంతో సేవలు అందించిన నల్లజాతి వెలుగుల సూరీడు మండేలా నేటి యువతకు నిత్య ప్రేరణగా నిలుస్తూ, భవిష్యత్తుకు దారులు చూపే దారి దీపం అవుతున్నారు. ‘ఏ లాంగ్‌ వాక్‌ టు ఫ్రీడం’ అనబడే పేరుతో ఆత్మకథను రాసిన మండేలాను దక్షిణ ఆఫ్రికా గాంధీగా పిలవడం సముచితంగా వుంది. మండేలా 67 ఏండ్ల జీవితా న్ని ప్రేరణగా తీసుకొని 67 నిమిషాలు ప్రజాహిత సేవలో అందరం గడిపి ఆయనకు అసలైన నివాళి అర్పించాలి. ప్రతిష్టాత్మక ‘మడిబా’ అనే బిరుదును పొందిన మండేలా 05, డిసెంబర్‌ 2013 న తుది శ్వాస విడిచారు.

ట్యాగ్‌లు: lifestyle