RTC Bus Accident Video: వీడియో ఇదిగో.. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు బోల్తా.. పలువురు ప్రయాణికులకు గాయాలు
RTC Bus Accident Video: వీడియో ఇదిగో.. ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు బోల్తా.. పలువురు ప్రయాణికులకు గాయాలు
RTC Bus Accident: ప్రకాశం జిల్లాలో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కామేపల్లి నుండి ఒంగోలు వెళ్లే మార్గంలో ద్వారకా సీఫుడ్స్ సమీపంలో ఒక పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టకుండా తప్పించే క్రమంలో డ్రైవర్ బస్సును పక్కకు తిప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సులోని పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కొండపి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో వివిధ పాఠశాలలకు వెళ్తున్న 20 మంది విద్యార్థులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
కాగా, ప్రమాదం జరిగిన వెంటనే సదరు ఆర్టీసీ బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.