Skip to content
జాతీయం వార్తలు

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట: 120 మందికి పైగా భక్తులకు గాయాలు..

Prajapaksham 16 Jul 2026 1 నిమిషాల పఠనం జాతీయం
Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట: 120 మందికి పైగా భక్తులకు గాయాలు..

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట: 120 మందికి పైగా భక్తులకు గాయాలు..

Puri Jagannath Rath Yatra: ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పూరీ జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. వార్షిక రథయాత్ర ఉత్సవాల్లో భక్తుల తాకిడి ఎక్కువ కావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. జగన్నాథుడి రథాలను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో.. గ్రాండ్ రోడ్ (బడా దండా) పరిసరాల్లో ఒక్కసారిగా తొక్కిసలాట వంటి ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ అపశ్రుతి కారణంగా కనీసం 120 మందికి పైగా భక్తులు ఊపిరాడక, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడి అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు అనుమానిస్తున్నప్పటికీ.. అధికారుల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ప్రత్యేక సహాయక బృందం (SRU) సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ఊపిరాడక పడిపోయిన బాధితులను అత్యవసరంగా చికిత్స నిమిత్తం పూరీ జిల్లా ప్రధాన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారందరికీ వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. లక్షలాది మంది తరలివచ్చిన ఈ వార్షిక ఉత్సవంలో భక్తుల భద్రతను నిర్ధారించడానికి.. అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి క్రౌడ్ మేనేజ్‌మెంట్, అత్యవసర ప్రతిస్పందన చర్యలను మరింత ముమ్మరం చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

గతేడాది jకూడా తొక్కిసలాట చోటు చేసుకుంది. వార్షిక రథయాత్ర సందర్భంగా శ్రీ గుండిచా ఆలయం సమీపంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ముగ్గురు భక్తులు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.