Fauzi Release Date: ఫౌజీ విడుదల తేదీ వచ్చేసింది.. శవాల మధ్య రైఫిల్‌తో ప్రభాస్.. డిసెంబర్ 3న బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం పక్కా..
Fauzi Release Date: ఫౌజీ విడుదల తేదీ వచ్చేసింది.. శవాల మధ్య రైఫిల్‌తో ప్రభాస్.. డిసెంబర్ 3న బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం పక్కా..
Fauzi Release Date: పాన్-ఇండియా సూపర్‌స్టార్ ప్రభాస్ అభిమానులకు సరికొత్త సర్ప్రైజ్ ఇచ్చారు. ఆయన నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఫౌజీ (Fauzi) అధికారిక విడుదల తేదీని మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రం 2026 డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. అజ్ఞాతపర్వ (అవిధేయత ముగిసింది.. తిరుగుబాటు మొదలైంది) అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేసిన ఈ అప్డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. రిలీజ్ డేట్ ప్రకటించడంతో పాటు విడుదల చేసిన ప్రభాస్ పవర్ఫుల్ పోస్టర్ అభిమానులలో అంచనాలను స్కై-హైకి తీసుకెళ్లింది. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడి గెటప్‌లో.. రక్తం మరకలతో ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు.
సీతా రామం వంటి క్లాసిక్ లవ్ స్టోరీని అందించిన దర్శకుడు హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. 1940ల నాటి బ్రిటిష్ ఇండియా కాలంలో, నేపాల్, భారత సరిహద్దు ప్రాంతంలో ఒక సైనికుడు చూపిన సాహసాలు, దేశభక్తి, భావోద్వేగాల నేపథ్యంతో ఈ కథ రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా ప్రముఖ సోషల్ మీడియా స్టార్ ఇమాన్వి కథానాయికగా టాలీవుడ్‌కు పరిచయం అవుతుండగా.. లెజెండరీ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.

రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్: 2026 డిసెంబర్ 3న ఫౌజీ ప్రపంచవ్యాప్తంగా విడుదల
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న మరో భారీ పీరియాడిక్ విజువల్ వండర్ కావడంతో దీనిపై ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ నెలకొంది. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, టి-సిరీస్ ఫిలిమ్స్ సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, భూషణ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషలలో ఏకకాలంలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్స్ శరవేగంగా పూర్తవుతుండగా.. వచ్చే ఏడాది డిసెంబర్ 3న థియేటర్లలో ఫౌజీ దండయాత్ర మొదలుకావడం ఖాయంగా కనిపిస్తోంది.