Skip to content
ఆంధ్రప్రదేశ్ వార్తలు

2029 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ ఖాయం…లేకపోతే గుండు చేయించుకొని తిరుగుతా..జడ్జ్ రామకృష్ణ సంచలన ఛాలెంజ్..

Prajapaksham 16 Jul 2026 0 నిమిషాల పఠనం ఆంధ్రప్రదేశ్
2029 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ  ఖాయం…లేకపోతే గుండు చేయించుకొని తిరుగుతా..జడ్జ్ రామకృష్ణ సంచలన ఛాలెంజ్..

2029 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ ఖాయం...లేకపోతే గుండు చేయించుకొని తిరుగుతా..జడ్జ్ రామకృష్ణ సంచలన ఛాలెంజ్..

జూలై 18వ తేదీన తిరుపతిలో జరగనున్న ఊరు వాడ కార్యక్రమం ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం పైన రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చలకు దారితీస్తోంది.

రా ఎన్టీఆర్ పేరిట ఏర్పాటైనటువంటి అభిమాన సంఘం ఈ ఊరు వాడ కార్యక్రమం చేపడుతున్నట్లు ప్రకటించింది. అయితే దీనిపై ఎన్టీఆర్ అభిమాన సంఘాల మధ్య కూడా విభేదాలు ఏర్పడ్డాయి అని చెప్పవచ్చు.

ఓవైపు ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి కూడా ఈ రా ఎన్టీఆర్ సభతో తమకు ఎలాంటి సంబంధం లేదని తమను తాము దూరం చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం అటు తారక అభిమానులు, లోకేష్ అభిమానులు ఒకరిపై ఒకరు విమర్శలు, ట్రోలింగ్ చేస్తూ వాతావరణం వేడెక్కిస్తున్నారు.

పనిలో పనిగా యూట్యూబ్ చానల్స్‌లో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రాకడపైన జోరుగా చర్చలు సాగుతున్నాయి. తాజాగా ఓ ప్రైవేటు యూట్యూబ్ ఛానల్‌లో తరచూ వార్తల్లో నిలిచే జడ్జి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

జూలై 18వ తేదీన తిరుపతిలో జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారంటూ సాగుతున్న ప్రచారం అబద్ధం కావచ్చు, కానీ ఎన్టీఆర్ పబ్లిక్ మీటింగ్స్ చాలా భారీ స్థాయిలో ఉంటాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ముఖ్యంగా జమీన్ రైతు పత్రిక సంపాదకులు డోలేంద్ర ప్రసాద్ ప్రచురించిన ఒక కథనం ఆధారంగా తాను ఈ సమాచారాన్ని విశ్లేషణ చేస్తున్నానని ఈ సందర్భంగా సదరు యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ జడ్జ్ రామకృష్ణ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.

ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం అనేది ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదని, గడచిన కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న ఒక వ్యూహాత్మకమైన బ్లూ ప్రింట్ అని ఆయన స్పష్టం చేశారు.

పైకి రాజకీయాల్లోకి రానని చెబుతున్నప్పటికీ కూడా, ఆయన స్పష్టంగా రాజకీయాల్లోకి రావడానికి ఒక రోడ్డు మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో సీనియర్ ఎన్టీఆర్ కూడా టిడిపి పార్టీ పెట్టే సమయంలో ఇలాగే ఖండనలు వచ్చాయని, ఆ తర్వాత ఆయన రాజకీయ పార్టీ పెట్టి విజయం సాధించినట్లు గుర్తు చేశారు.

ఇక గతంలో చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీ పెట్టే ముందు తాను రాజకీయాల్లోకి రావడం లేదని బహిరంగ లేఖలు చాలా రాశారని, కానీ చివరకు ఆయన రాజకీయాల్లోకి వచ్చారని, ఆ తర్వాత పార్టీలు ఏర్పాటు అయిన సంగతిని ఆయన గుర్తు చేశారు.

ఒక రాజకీయ పార్టీ ప్రకటన చేసే ముందు అనేక సాంకేతిక అంశాలను సరిచూసుకోవాల్సి ఉంటుంది. అన్ని సిద్ధం అయ్యాకే వారు అడుగు పెడతారు. అందుకే అప్పటివరకు ఇలాంటి ఖండనలు వస్తూనే ఉంటాయి. కానీ రాజకీయ లక్ష్యం మాత్రం పక్కకు తప్పుకునే అవకాశం లేదని జడ్జి రామకృష్ణ పేర్కొన్నారు.

అంతేకాదు, ఒక అడుగు ముందుకు వేసి 2029 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెట్టకపోయినా లేదా పోటీ చేయకపోయినా నేను జీవితాంతం గుండు కొట్టించుకొని తిరుగుతాను అని జడ్జి రామకృష్ణ సంచలన సవాల్ విసరడం గమనార్హం.

రా ఎన్టీఆర్ అనే సంస్థ జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానించాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా, తనకు జూనియర్ ఎన్టీఆర్‌కు అత్యంత ఆప్తులు, వారి దగ్గర బంధువుల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని, అందుకు బ్లూ ప్రింట్ కూడా సిద్ధమై ఉందని తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్‌లు: andhra pradesh jr ntr